Thursday, May 10, 2018

మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు ‘శుభప్రదం’తిరుపతిలోని 7 కేంద్రాల్లో 3 వేల మందికి శిక్షణ

మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు 'శుభప్రదం'తిరుపతిలోని 7 కేంద్రాల్లో 3 వేల మందికి శిక్షణ ఏర్పాట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

మే 09, తిరుపతి, 2018: భారతీయ సనాతన ధర్మంలోని మానవీయ నైతిక విలువలు, ఆర్ష ధర్మాలపై అవగాహన కల్పించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉన్నతాశయంతో మే 25 నుండి జూన్‌ 1వ తేదీ వరకు 7, 8, 9 తరగతుల విద్యార్థులకు శుభప్రదం శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుపతిలోని 7 కేంద్రాల్లో 3 వేల మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హెచ్‌డిపిపి ప్రోగ్రాం అసిస్టెంట్‌, జిల్లా ధర్మప్రచార మండలి సభ్యులు, టిటిడి కల్యాణమండపాలతోపాటు టిటిడి వెబ్‌సైట్‌లో మే 10వ తేదీ నుండి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను మే 19వ తేదీలోపు తిరిగి అక్కడే సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. తిరుపతిలోని విద్యార్థులు స్థానిక అన్నమాచార్య కళామందిరంలోని హెచ్‌డిపిపి కో-ఆర్డినేటర్‌ వద్ద దరఖాస్తులు పొందవచ్చన్నారు. ఈ తరగతుల్లో శ్రీవేంకటేశ్వరుని జీవితచరిత్ర, భగవద్గీత, సనాతన ధర్మపరిచయం, రామాయణ, భారత, భాగవత సందేశం, ఆర్ష వ్మాయం, వ్యక్తిత్వ వికాసం, భారతీయ కుటుంబ జీవనం, పండుగలు-పరమార్థాలు, ఆచారాలు – వైజ్ఞానిక దృక్పథం, మాతృభాష, విద్య, దేశభక్తి తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని వివరించారు.

తిరుపతిలోని టిటిడి విద్యాసంస్థలైన ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్వీ జూనియర్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు జూనియర్‌ కళాశాల, ఓరియంటల్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని జెఈవో తెలిపారు. మే 25వ తేదీన విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సూచనలిచ్చేందుకు ఆర్‌టిసి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటుచేయాలని, ఆయా కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు రానుపోను ఛార్జీలు, మెటరీయల్‌, నిష్ణాతులతో బోధన అందిస్తామన్నారు. ప్రథమ చికిత్స, తాగునీరు, ఆహారం, భద్రత, వసతి, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.


-------
        विक्रम  कुमार

        8331926163

        www.padaayi.blogspot.in






--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

Payment from your account.

Greetings! I have to share bad news with you. Approximately few months ago I have gained access to your devices, which you use for inter...