ఆటవెలది....
జలములిచ్చికాచు జనులందరినదియె
జగతిలోని మనకు జనని యగును
జమునమాత గొల్వ జన్మ ధన్యంబగు
జలము లేనినాడు జగములేదు
ఉత్తరభారత దేశమున యమునా నదిని జమునానదిగా పిలుస్తారు!
------------------
తేటగీతి....(కలుషితము చేయకుండా కాపాడుకోవాలి అని....)
జగదీశ్వరుడొసగె మనకు జలరాశులెన్నియో
జలములొసగుగాదె మనకు జవమనవరతము
జలము లేని జగము తలచ జలదరించునొడలు
జలమొసగు నదిని కావ జాగ్రత్త పడవలె
------------------
ఆటవెలది....
ప్రాణికోటి కావ ప్రవహించు గోదారి
పుష్కరాల వేళ పుష్కలముగ
పుణ్యమందు జనులు; పురహరు సన్నిధి
ననుభవింత్రుగాత అమల చరిత
ఓ కల్మషరహితా! ప్రాణికోటికి జీవాధారమైన గోదావరి నది యొక్క అంత్య పుష్కరాల సమయములో చాలా పుణ్యము సముపార్జించే భక్తులు పురహరుని సన్నిధిని చేరుకోగలరు!
----
జలమునిచ్చు నదియె జనుల పోషించు
జలము లేనినాడు జగములేదు,,,
దీనిని ఒక పేజీలో నినాదంగా ప్రచురించవచ్చు
-----
6-4-14 ఆదివార౦ ’ఈనాడు’ పుస్తకములో 14వ పుట చదవమని & ప్ రతిస్ప౦దన తెలుపమని మానుకొ౦డ శ్ రీనివాసు కోరగా....
మహిళలుద్యమి౦ప మద్యమెటుల పాఱు
బారుల౦దు? జాతి బలము నష్ట
పరచు మ౦దు మాన్ప పాటుపడినయ౦త
మ౦చి జరుగగలదు మానవులకు /(శుభము కలుగ గలదు సర్వులకును)
----
----
మహిళ తలచిన౦త మద్యరక్కసి రూపు
మాయు నిజముగాను; మత్తు వదిలి
మనిషి మనిన నాడు మహియె స్వర్ గమగును;
పాడు బుద్ధి మాన్ప పాటు పడుము
మహిళల్ని ప్రబోధిస్తూ....మీరు త లచుకు౦టే మద్య భూతాన్ని తరిమికొ ట్టడ౦ సులభమే. మత్తుకు బానిస కా నినాడు మనిషికి భూతలమే స్వర్గము గా తోచును .. కనుక పాడు బుద్ధులను మాన్ పగా కృషి చెయ్య౦డి....దూబగు౦ట రో శమ్మను ఆదర్శముగా తీసుకో౦డి
----
ఓటు వేసేప్పుడు జాగ్రత్త!
ఓటు వెయ్యమనుచు ఒకరు చెప్పవలెనె?
లోటు చేయ కలుగు లోకమునకు
చేటు; కాన మనము చెనటులపై వేటు
వేయవలెను యిపుడె వేగిరముగ
----
పాట్లు తప్పవోయి పట్టుదలగ మీరు
ఓటు వేయకున్న; ఓర్పు కలిగి
నిలువు వరుసలోన; నిలుపుము నీతిని
నిష్ఠ తోడ; మెచ్చు నిఖల జనులు
----
ప్రజలెన్నుకొనిన ప్రభువులె పాలన
జేయవలెను సతతము; చెనటివారు
యెటులో పీఠమెక్క యేడ్పులె గతి; కాన / (యెటులో పీఠమెక్క యేడ్పులె గతియగు;)
తెలివి కలిగి మెలగు తెలుగుబిడ్డ
మరిన్ని పద్యాల కొరకు
మరిన్ని పద్యాల కొరకు
భవదీయ
పింగిళి విక్రమ్ కుమార్ (EE05S007)
No comments:
Post a Comment