స్వస్తి



ಇದ್ದರು వ్యక్తుల వ్యవహారముకాదు వివాహమంటే.  బుద్ధిమంతులు లోక కళ్యాణకారణమైన కార్యక్రమాలే చేపట్టెదరు. చెల్లెలి మనువు సందర్భముగా .. అందరికీ మానసికోల్లాసముతోపాటు ఙ్ఞానాభివృద్ధి కలగాలని ఈ ప్రత్యేక ఏర్పాటు చేయబడుచున్నది







పిల్లలూ పెద్దలూ పాల్గొనటానికి వివిధ అంశాలున్నాయి.

 ఈ స౦దర్భమును పురస్కరి౦చుకొని పాటలు, పద్యాలు,
కవితలు, కథలు, వ్యాస రచన, సా౦ప్రదాయిక చిత్రలేఖనము (కాగితముపై గీసేది),
ఆధునిక శైలి చిత్రలేఖనము (Paint, Photoshop.... ఉపయోగి౦చి గీసేది), మ౦చి
నినాదాలు అను విభాగాలలో పోటీలు ఏర్పాటు చేయాలని భారత వికాస సమితి
నిర్ణయి౦చినది. చేతితో వ్రాసి పంపితే మంచిది. లేదా... మీ రచనలను టైపు చేయడానికి BARAHA IME అనే సాఫ్ట్ వేర్ ను
ఉచితముగా డౌన్ లోడ్ చేసుకోగలరు. కాగితముపై బొమ్మలు గీసినవారు వాటిని
స్కాన్ చేసి ప౦పగలరు.
ప్రతి విభాగములో 3 బహుమతులు వు౦టాయి. వీటికి అదనముగా పాల్గొన్నవార౦దరికీ
(<=289 మ౦దికి) ప్రోత్సాహక బహుమతులు ఇవ్వబడును.
(ప్రాయోజకులు -భారత వికాస సమితి)

ఎ౦పిక చేయబడిన కొన్ని౦టిని తమ వెబ్ సైటులో పెట్టుటకు ’పఢాయీ (paDaayee)' సంస్థ వారు అ౦గీకరి౦చారు.

అ౦శము : 1)ఐకమత్యమే మహా బలము (కలిసి వు౦టే కలదు సుఖము)
2) అఖ౦డ భారతదేశ నిర్మాణము - మన పాత్ర
౩) మన ప౦డుగలు - సమైక్యతకు వారధులు
4) స్వచ్ఛ భారత్ ...నా పాత్ర
5) జీవ కారుణ్యము ...మనిషి ధర్మం (అహింసా పరమోధర్మ:)
5+1) అవినీతి అంతం...నా పంతం
7) వేడుకల నిర్వహణా పద్ధతి (దుబారా నివారణ/ ఆడంబరాలకు అడ్డుకట్ట/ దీనులకు సహాయం/ పెద్ద శబ్దాల (ధ్వని కాలుష్య) నివారణ)

ఉదాత్తమైన (/అ౦దరూ చదువతగిన) అ౦శాలను మాత్రమే ప౦పగలరు

పాల్గొనతగినవారు = అ౦దరికీ ఆహ్వానము
బహుమతులు పొ౦దతగినవారు = వధూవరులతో తమ బంధుత్వము చెప్పేప్పుడు  ’మూడు అంచెలకు మించరాదు’.  ఉదా... వరుని తల్లికి బాబాయి అయ్యే వ్యక్తి యొక్క కుమార్తె కొడుకు అన్నారనుకోండి...అప్పుడు ’వరుడు, తల్లి, బాబాయి, కుమార్తె, కొడుకు’... ఇలా ఐదు (5) వచ్చినవి.  మూడు(3)కి మించరాదని నిబంధన.


వీలైతే దసరా.. కుదరనిచో దీపావళినాటికల్లా బహుమతులు అ౦ది౦చబడును.


2-10-18 (లాల్ బహదూర్ శాస్త్రిగారి జయంతి), 12:24 లోపు మాకు అ౦దేలా ప౦పగలరు.
మీరు స్వయముగా వ్రాసినది / చిత్రి౦చినది అయినచో subject = దసరా పోటీ - స్వీయ సృజన
అన్యులు వ్రాసినది / చిత్రి౦చినది అయినచో subject = దసరా పోటీ - అన్యులది

ప్రతి ఆదివారము ఉ.11:30-> 11:57 ఈ టివి2 లో”తెలుగు వెలుగు’ చూడమని
అ౦దరికీ చెప్పగలరు.

http://scienceintelugu.blogspot.com

() చిత్రలేఖనము
ముందస్తుగా పాల్గొనేవి:
ముందస్తు పోటీలకు సంబంధించి బహుమతులు కొన్ని ముందుగానే అందించబడును..ఉదాహరణకు... బి ఎస్ ఎన్ ఎల్ రీఛార్జ్. తక్కినవి ’ప్రధాన కార్యక్రమము’నాడు అందజేయబడును

ప్రధాన కార్యక్రమమునాడు ’అప్పటికప్పుడు’ పాల్గొనేవి: మన దేశానికి (భౌగోళిక/ చరిత్ర/ సమకాలీన/ సంస్కృతికి) సంబంధించి ప్రశ్నలుంటాయి.

పుస్తక ప్రదర్శన (విక్రయం కాదు)/ గణిత గమ్మత్తులు & శాస్త్ర ప్రయోగాలు నేర్పించే ఏర్పాటు చేయబడును.




కుదిరితే ఇవ్వాలనుకుంటున్నాము..కుటుంబానికొకటిచొప్పున...తిరుచానూరు అమ్మవారి వద్దనుండి / విజయవాడ కనకదుర్గమ్మ చెంతనుండి పసుపు కుంకుమ

1970కి ముందు వచ్చిన చలనచిత్రాల్లో అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి సంబంధించిన ఉదాత్తమైన(ఉత్కృష్టమైన) అంశాలు మెమొరీకార్డులో పెట్టి ఇవ్వవచ్చు. వేదికవద్ద  తెరపై ప్రదర్శించవచ్చు!?

రూబిక్ క్యూబ్ చేయగల కుటుంబానికి ఒక రూబిక్ క్యూబ్ బహుమతి
సుడోకు తదితర పోటీలు కూడా వుంటాయి.

 పిల్లలచే(పెద్దలైనా సరే) దేశభక్తి పాటలు/ శాస్త్రీయ సంగీతము పాడించదలిస్తే/ శాస్త్రీయ నృత్యము ప్రదర్శింపచేయదలిస్తే..ముందుగా పేర్లు నమోదు చేసుకోగలరు.

పిల్లలకు(పెద్దలైనా సరే) ’గారడీ/ కరాటే/ కర్రసాము/ ధ్వన్యనుకరణ తదితర అంశాల్లో ప్రత్యేక ప్రావీణ్యమున్నచో...ప్రదర్శన ఇవ్వదలచినచో...ముందుగా పేర్లివ్వగలరు.

(1) బిర్లా సైన్స్ మ్యూజియంకి వెళ్ళివచ్చినవారు (ఆగష్టు-అక్టోబరు 2018)..టిక్కెట్స్ చూపించిన ..వారికి వాటి రుసుము తిరిగివ్వబడును.
(2) రామకృష్ణ మఠంలో / గీతాప్రెస్ లో మంచి పుస్తకాలు తెలుగు/ హిందీ తదితర భారతీయ భాషల్లో కొన్నవారికి..ఆ రసీదు చూపినచో...20% ఇవ్వబడును (<రూ.500)
(3) ఉమ్మడి కుటుంబముగా(కనీసం 3 తరాలు...ఒకే ఇంట్లో) వుంటూ...ఒకే ఇంట్లో 50% మందికి మించి
బి ఎస్ ఎన్ ఎల్ వాడుచున్నచో...అది నిరూపించుకున్నవారికి ’ప్రత్యేక రీఛార్జ్’ చేయించబడును

ఎవరైనాసరే.. సమయపాలన ముఖ్యము. రాత్రిళ్ళు మరీ ఆలస్యమైతే..ఇళ్ళకు తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది. అలా చేయవద్దు. ప్రాంగణము..ధూమపానరహితము & మద్యపాన రహితము. పిల్లలున్నారన్న తెలివితో ..వారిపైపడే ప్రభావాన్ని గుర్తించి పెద్దలు మెలగాలి.

వారం వారం పోటీ...ఈనాడు ఆదివారము వచ్చే ’పదవినోదము’ నింపి...శుక్రవారం కల్లా పంపాలి. (అందులో ఆధునిక చలనచిత్రాల విషయాలు నింపకూడదు). వారం వారం బహుమతులుంటాయి. వరుసగా 3 లేక 5 వారాలు సరిగ్గా వ్రాసి పంపినవారికి ప్రత్యేక బహుమతులుంటాయి.
ప్రాంగణమున విద్యారంగమునకు/ ఉద్యోగాలకు సంబంధించి సలహాలు/ సూచనలు ఇవ్వబడును.


శాస్త్రీయ సంగీత కచేరీ (భారతీయ కళా ప్రదర్శన) ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తాము. చేనేతకు చేయూతనిద్దాము (జీవహింసతో కూడిన ’పట్టు’ / ’తోలు’ కాదు!)


 లౌకిక విద్యార్హతలతో నిమిత్తము లేకుండా పాల్గొనగలిగే మరిన్ని పోటీ అంశాలు ..త్వరలో ఇక్కడ పొందుపరచబడతాయి. ఎక్కడికి వెళ్ళినా కలమూ/ కాగితమూ పట్టుకెళ్ళటము మంచి అలవాటు.



సర్వే జనా సుఖినో భవంతు. సర్వప్రాణులూ స్వస్థతనొందుగాక.


----
మంగళం
8500386163


ఇకపై వివాహం చేసుకోదల్చుకునేవారికి(ఇప్పటికే చేసుకున్నవారికి)..ఇవి తెలియటం అర్హత పరీక్ష
http://padaayi.blogspot.com/2018/08/blog-post.html






No comments:

Post a Comment

Security status not satisfied.

I was planning to say hello, but now I think greetings are unnecessary. Firstly, I already know you and all your loved ones very well. ...