Monday, November 16, 2015

హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట ... సిగ్గుచేటు!

నిన్న దినపత్రికలో పోలీసు పెద్దాయన చెప్పె.. హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట...ఎవడబ్బ సొమ్ముతో? కెమెరాలమ్మే విదేశీ కంపెనీలకు పండుగే... మనకా ఖర్చు దండగే!!   ఇదేనా అభివృద్ధి? ఇక్కడ నాశనము చేసినది చాలదని ఇప్పుడు  33,000 ఎకరాలపై పడతారట! అసలు నేరాలకు మూలకారణమైన మద్యమును నిషేధించి పకడ్బందీగా  అమలుచేయాలన్న ఇంగితము లేదే? విశృంఖలముగా చెలరేగి బుద్ధి చెడగొడుతున్న చలనచిత్రాలు / ప్రసారసాధనాలకు/ వాణిజ్య ప్రకటనలకు/ మతమార్పిడులకు   అడ్డుకట్ట వేయరే? గుడికి వెళ్తే ...దొంగలున్నారు జాగ్రత్త అని వ్రాస్తున్నారంటే మరి నాగరికులు ఏమి సాధించినట్టు?   అమాయక ప్రజలను పక్కదారి పట్టించడానికి ..ఇన్నిన్ని కెమెరాలు పెడుతున్నామని హడావిడి చేస్తేసరిపోదు. హెల్మెట్ విkraయములోnoo ఇదే తంతు!! ప్రజలు మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వాలు నిజముగా అంత బాధపడుతున్నాయా? మరి >100కిమీ వేగముతో వెళ్ళే ద్విచక్రవాహనాలను ఎందుకు తయారుచేయనిస్తున్నట్టు ? సామాన్య ప్రజల అవసరాలకు అంత వేగమెందుకయ్యా  వెఱ్ఱి కాకపోతే! వాహనాల తయారీదారుల డబ్బుదాహానికి అమాయక ప్రజలు బలయిపోతున్నారే...   రోగానికి అసలు మందు వేయాలి. బాధ్యతగల పౌరుల సహకారముతో నేరాలను అరికట్టడానికి పెద్దయెత్తున ప్రయత్నము జరగాలి.   

----
పద్యాల విక్రమ్ కుమార్
(8331926163 always BSNL)

No comments:

Post a Comment

Payment from your account.

Greetings! I have to share bad news with you. Approximately few months ago I have gained access to your devices, which you use for inter...