తెలుగువారు కలిసి తెలివిగ మసలగ
భువియె స్వర్గసీమ; బుద్ధిలేని
వారె వేర్వడంగ వాగుచుండుదురట్టి (/ వాగుచుండెదరట్టి)
తుంటరుల గళములు తుంచవలయు
౨౦-౧౧-౧౫ ౦౯:౦౦ దుష్టులు ఏవేవో కల్పించి
చెబుతుంటారు. వాటితో గతితప్పక, సమైక్యతకు పట్టం కట్టాలి. వేర్పాటువాదుల(గళము)ను అణిచివేయాలి
-----------------
చేయదగినవేవి? చేయకూడనివేవి?
ఏది మేలు చేయు? ఏది కీడు
సలుపు? తెలియపర్చు సర్వజనులకీవు
వేదవిద్య నేర్వు వేగిరమున
(/వేదవిద్య నేర్పు వేగిరముగ)
౧౯,౨౦-౧౧-౧౫ ఒక వ్యక్తికి అతని కర్తవ్యమును
బోధిస్తూ హితైషి యిట్లు పలికె....నీవు త్వరగా వేదవిద్య నేర్చుకో. అంతట ఏవి జగమునకంతటికీ
మంచి చేయునో, ఏవి కీడు చేయునో ప్రజలకు చెప్పవలె.
ఇతరులకు వేదవిద్య నేర్పుట నీ కర్తవ్యమని
కూడా భావించవచ్చు
--------------------
కాకరకాయ వండు (/వండె) కార్తీక మాసాన;
కాయమునకు మేలు కలుగు తినగ;
నాటురకము శక్తి; నాశనమొనరించు
సంకరములు తినరు సంతులెపుడు (/సాధు జనులు)
జన్యుపరివర్తిత పంటలతో మనవైన దేశీయరకాలకు
సవాలు విసిరే కుటిలాత్ముల ఆగడాలకు అంతం పలకాలి.
మంతెన సత్యనారాయణ వంటి వారు ప్రచురించే
వ్యవసాయ /ఆరోగ్యపరమైన పుస్తకాలకు ప్రచురణకై పంపాలి
------------------
పెద్దవానవచ్చె పేదోళ్ళకిబ్బంది
తెచ్చె ; తిండి లేదు! తెరపి లేక
కురియు వానవలన కూలెనిళ్ళెన్నెన్నొ
కలతదీరునెపుడొ కనగరాదు
చెన్నై నెల్లూరు తదితర ప్రాంతాల ప్రజలు
వానలు వరదలతో ఇక్కట్లు పడుతున్నందున...సాధారణ పరిస్థితులు నెలకొనేదెప్పుడో అని జనము
అనుకుంటున్నారు. మరోలా ఆలోచిస్తే... ప్రభుత్వాలు తూతూమంత్రముగా తాత్కాలిక ఏర్పాట్లేవో
చేసి ప్రస్తుతానికి మమ అనిపించినా..మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పు వస్తే ఎలా? అసలు
శాశ్వత పరిష్కారమెప్పటికి అని ప్రజలు తలస్తున్నారు.
---------------
రాజధానిమార్చ రాజుగ వున్నోడు
వురకలెత్తుచుండె వుత్సహించి
తప్పుదారిబట్టి తాసలిపినపని
ఉచ్చు బిగియకున్నె ఊరు వదల?
ఓటుకు నోటు వంటి వ్యవహారముల నుండి తప్పించుకోవడానికే
హైదరాబాదు నుండి ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాడని
ప్రతిపక్షాలంటున్నవి. హైదరాబాదు తెలుగువారందరిదీ. జై విశాలాంధ్రప్రదేశ్. ఇక్కడే వుంటూ
సమైక్యతకు దోహదము చేసేలా బాబు ఎప్పుడు ఆలోచన చేయునో?
No comments:
Post a Comment