Thursday, December 17, 2015

ఇలాంటి అడ్డదారి(షార్ట్ కట్స్) పనులు చేయకండేం!!

శివకుమారు పూజ శీఘ్రముగ సలుప;
దేవసేన నడుపు దేవు గొల్వ;
డయగలరు మీరు హువిభవంబులన్;
మేలు కలుగు నిజము మేదినీశ!

ఓ రాజా! శివ కుమారుణ్ణి (ఇలా వ్రాయటము వల్ల కుమారస్వామి పేరులోని ’కుమార’ శబ్దమును పద్యములో వాడినట్టయినది) , దేవతల సైన్యాధ్యక్షుణ్ణి పూజించగా మీకు వైభవములు కలుగును...మేలు జరుగును అని  నారదుడు అన్నట్టు మీరు భావించవచ్చు.


మేదిని= భూమి; ఈశ=> పాలించేవాడు

17-12-15 ఈరోజు కుమారస్వామి షష్ఠి కాన గుడికి వెళ్ళమని అమ్మ చెప్పగా...బదులుగా ఈ ఆటవెలది పద్యముతోసరిపెట్టితి! మీరూ ఇలాంటి అడ్డదారి(షార్ట్ కట్స్) పనులు చేయకండేం!!

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...