नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ଶୁଣିବେ/ നമസ്കാരം
ఇవిగో డబ్బులు..మరి ప్రాజెక్ట్స్ ఏవి?
కొత్త విద్యాసంవత్సరములోకి కొంగొత్త ఆలోచనలతో అడుగుపెట్టినవారికి శుభాకాంక్షలు. పాత ఆలోచనలవారికీ చోటుందిందులో!
చేయాలన్న తపన వున్నది. డబ్బులు లేక ఏమీచేయలేకపోతున్నామనే వారు కొందరైనా వుంటారు. పేదరికము ఙ్ఞానార్జనకు అడ్డుకారాదన్న తలపుతో..ఆసక్తి కల అర్హులైన అధ్యాపక/ విద్యార్థి బృందాలకు కొంత దన్నుగా వుండదలచి ఈ ప్రయత్నం చేస్తున్నాము....
ఒక్కో బృందానికి గరిష్టముగా రూ. 5000 ఇవ్వబడును. చేసిన ప్రాజెక్ట్ photos/ video బృంద సభ్యులు తీసుకోవచ్చు. ఎక్కడైనా (కాలేజీ పోటీల్లో) ప్రదర్శనగా పెట్టుకోవచ్చు...అక్కడ బహుమతులు పొందవచ్చు. కానీ..16 అక్టోబరు 8కల్లా..ఆ పనిచేస్తున్న ప్రాజెక్ట్ ను శాశ్వత ప్రాతిపదికన ప్రోత్సాహక ఖర్చులు ఇస్తున్న మాకు ఇచ్చివేయాలి. మీ ప్రాజెక్ట్ మీరే వుంచుకోదలిస్తే... మేమిచ్చిన డబ్బు మాకు 16 సెప్టెంబరు 9 కల్లా బృంద సభ్యులు (అనుమతించిన అధ్యాపకుడు) ఇవ్వాల్సి వుంటుంది.
డబ్బులు నేరుగా ఇవ్వవలదు. డీడీ/ చెక్/ (ప్రభుత్వ బ్యాంకు) ఖాతా<-->(ప్రభుత్వ బ్యాంకు) ఖాతా బదిలీ మాత్రమే చెల్లుబాటగును.
నిబంధనలు...
1) ఒక్కో బృందములో 2-5 విద్యార్థులుండాలి. ఏ అధ్యాపకుని పర్యవేక్షణలో ప్రాజెక్ట్స్ చేద్దామనుకుంటున్నారో ...వారి నుండి అనుమతి పత్రము జతచేయాలి. మీ విభాగాధిపతి లేక ప్రధానోపాధ్యాయుల అనుమతి తప్పనిసరి.
2) చేయదలచినది ఏమిటి..సమాజానికి ఎలా ఉపయోగపడును? ఎంత ఖర్చగును? డబ్బులు అందినాక
ఎన్నిరోజుల్లో చేసి చూపగలరు? (వానలు/ పండుగలు/పరీక్షలు వుంటాయని ముందే ఆలోచించాలి) వంటివి
సుమారు 108-720పదాల్లో వ్రాయాలి (ప్రాజెక్ట్ కు సహేతుకమైన చిన్న పేరు/ శీర్షిక పెట్టండి).
4) భారతదేశములో చదువుతున్నవారికి మాత్రమే
5) ఒక్క కాలేజీ నుండి గరిష్టముగా 5 ప్రాజెక్ట్స్ మాత్రమే (చిన్నచిన్నవి వుంటే..వాటిన్నన్నిటినీ ఒక పెద్ద ప్రాజెక్ట్ గా
మలచవచ్చు. ఉదాహరణకు...బడిపిల్లలకు శాస్త్రవిషయాలు సులభముగా అర్ధమయ్యేల్లా మీరు చిన్న చిన్న
ప్రయోగాలు/నమూనాలు చాలా చేస్తే..వాటిని ఒక పెద్ద ప్రాజెక్ట్ గా భావించవచ్చు.)
5+1) మీరు చదువుతున్నది ఇంజనీరింగ్ ఐననూ...మీరుచేసే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ స్థాయివారినిఉద్దేశించి
వుండనక్కరలేదు
ముఖ్యమైన గడువు తేదీలు (సమయము 17:01)
ప్రాధమిక ఆసక్తి వ్యక్తీకరణ... 20-7-16
తొలిదశ దాటినవారి జాబితా ప్రకటన (నిపుణుల పరిశీలన తర్వాత) 23-7-16
ప్రాజెక్ట్ గూర్చి పూర్తి స్థాయి నివేదిక(లిఖిత/ ధ్వని/ దృశ్య) 31-7-16
తుది ఎంపిక(నిపుణుల పరిశీలన తర్వాత) 7-8-16
డబ్బు అధ్యాపకుని ఖాతాకు చేరాలి 10-8-16
ప్రాజెక్ట్ ఎంతదాకా వచ్చిందన్న సమీక్ష(నివేదిక సమర్పించాలి) 2-9-16
ప్రాజెక్ట్ కాలేజీలోనే వుంచుకుంటామంటే డబ్బు నిర్వాహకులకు ఇవ్వాలి 9-9-16
పూర్తైన ప్రాజెక్ట్ నిర్వాహకులకు అందాలి 8-10-16
విద్యార్థులకు/అధ్యాపకులకు ప్రశంసాపత్రాలు 17-10-16
వీలైతే భవిష్యత్తులో చేద్దామనుకుంటున్నద...చేసిన ప్రాజెక్ట్స్ ని వివిధ కాలేజీల్లో / సమీప ప్రభుత్వ పాఠశాలల్లో ప్రదర్శనగా పెట్టేలా ప్రోత్సహించడము.
vikram2036.iitm@gmail.com
8500386163
8331926163()