Saturday, August 5, 2017

Forwarded message..

ప్రైవేటు టీచర్ల వెట్టిచాకిరీ- జ్ఞాన దోపిడీ చేసే దౌర్భాగ్యులు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాलु(majority...not all)
------------------------------------------
ఇవి ప్రైవేటు బడులు కావు జనరల్ స్టోర్ దుకాణాలు
---------------------------------------------
పేరెంట్స్ దగ్గర వేలకు వేలు గుంజి పనిచేసే టీచర్స్ కు ఎంగిలి మెతుకులు విసురుతూ.. ప్రైవేటు టీచర్స్ నోటికాడి అన్నం ముద్దను లాక్కు పోయే అత్యంత రాక్షస ప్రవ్రుత్తి కలిగిన ప్రైవేటు యజమానులు చాలా మంది ఉన్నారు.
------------------------------------------
ప్రైవేట్ టీచర్స్ రక్తాన్ని.. శ్రమను.. సమయాన్ని... సంతోషాన్ని.. న్యాయంగా వారికి రావలసిన జీతాలను దోచుకునే చాలా మంది ప్రైవేటు బడుల యజమానులకు.. ఈ ప్రైవేటు గురువుల ఉసురు తగిలి 3-4తరాల వరకు కొంత మంది యజమానులు.. వారి వారి పిల్లాజేల్లాకు ఉసురు ముట్టి రకరకాల రోగాల్తో కుళ్ళి కుళ్ళి నశించక తప్పదు.
-------------------------------------------
ప్రైవేటు టీచర్స్ రక్తం పీలుస్తున్న జలగలు స్కూల్ యజమాनुलु
---------------------------------------------
ప్రైవేటు టీచర్స్ చాలా మంది వాళ్ళకు వచ్చే జీతాలను లోకం లో ఎవరికీ తమ నిజమైన జీతాలని  చేప్పుకోరు. అందరూ 15-20 వేలుకు పైగా వస్తాయని అబద్దాలు
చెప్పుకునే అమాయకపు అభాగ్యులు ఈ ప్రైవేటు టీచర్స్
---------------------------------------
* రోజువారీ జీతగాళ్ళు ప్రైవేటు ఉపాధ్యాయులు
* స్కూల్ ఓనర్లకు భయపడుతూ... వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటే చాలు ఏ అర్హతలు లేకున్నా టీచర్స్ గా వాళ్ళ స్కూల్ లో ఉండనిస్తారు.
-------------------------------------------
* కార్మికులకు కార్మిక సంఘాలు.. రైతులకు రైతు సంఘాలు.. 100 రోజుల పనివాళ్ళకు సంఘాలు ఉన్నాయి కానీ.. ఏ సంఘం కూడా లేనివారు ప్రైవేటు టీచర్స్.
------------------------------------------
* పొరపాటున ఎవరైనా సంఘం కనుక పెడితే.. సంఘం లో సభ్యులు గా ఉంటే ఆ టీచర్స్ కు ఉద్యోగమే లేకుండా చేస్తారు అందరు స్కూల్ యజమానులు.
---------------------------------------
* గ్రామం / మండలం / డివిజన్  / ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో దాదాపుగా అన్ని ప్రవేటు స్కూల్స్ లో నెలకు Rs.3000/- నుండి Rs.9000/-వరకు మాత్రమే జీతంగా పొందే వారే అధికం.
-------------------------------------------
* ఎక్కడో ఏదో ఒక స్కూల్ లో 10 వేల నుండి 15వేల వరకు జీతాలు పొందినా ఆ స్కూల్స్ లో పనిచేసే వారి బాధలు నరకం కంటే అధ్వాన్నంగా ఉంటాయి.
-------------------------------------------
* ఎక్కడైన నెలకు 30రోజుల జీతం ఉంటే   ఈ ప్రైవేట్ స్కూల్స్ లో  నెల కు ఒక సెలవు మాత్రమే ఇచ్చి ఒక్కటి ఎక్కువ సెలవు వాడుకున్నా... జీతం కట్.. ఆదివారాలు సెలవులు తీసేసి జీతం ఇస్తుంటారు.
* చాలా  ప్రైవేటు బడులల్లో ఆదివారం కు మున్దుగానీ.. తర్వాత గానీ సెలవు పెట్టుకుంటే 2రోజుల జీతం కట్.
*ఏదైన అనారోగ్యం గానీ ఇబ్బందులు గానీ వస్తే సెలవులు ఇవ్వరు... కొత్త వారిని పెట్టుకుంటారు.
ఇలా చెప్పుకుంటూ పోతుంటే అసలీవి ఉద్యోగాలే అనరు. పూర్వ కాలంలో  బావుల కాడ పనిచేసే జీతగాళ్ళు కంటే వికారమైనవి.. ఈ ప్రైవేటు టీచర్స్ జాబులు.
* విద్యార్థుల ఇళ్ల చుట్టూ తిరిగి వారిని స్కూల్స్ లో  చేర్పించాల్సిన భాద్యత...   
* ఉదయం నుండి రాత్రి  వరకు వారికి బోధన చేయాల్సిన బాధ్యత...       
* ఎలాంటి విద్యార్థికైనా ర్యాంకు తెప్పించాల్సిన బాధ్యత....
* విద్యార్థి ఫీజు చెల్లించే బాధ్యత... తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత....పరీక్షల పేపర్లు దిద్దాల్సిన బాధ్యత...
*ఇన్ని బాధ్యతలు బాధలు పడి చివరికి ఇంక్రిమెంటు అడగడానికి భయం, సెలవు అడగడానికి భయం, మన పిల్లలను ఉచితంగా చేర్పించడానికి భయం... చివరికి ఏసీ గదుల్లో సీసీ క్రింద కూర్చోని ఏరోజు ఎన్ని ఫీజులొచ్చాయి..? వాటితో ఏ కారు కొనాలి..? ఏ ఇల్లు కొనాలి..? ఏ ప్లాటు కొనాలి..? ఏ భూమి కొనాలి..? ఇవన్నీ ఆలోచిస్తారే కానీ.... ఏ అధ్యాపకుడైనా జీతం సరిపోక బాదపడుతున్నాడా..? అధ్యాపకులకు అడ్వాన్స్ అవసరమా..? నా సంస్థను మోస్తూ నన్ను అభివృద్ధి చేసే ఈ అధ్యాపకులకు ఇంకా ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇద్దామా... అని ఏ ఒక్క యాజమాన్యమైనా ఆలోచిస్తుందంటే నిజంగా వారికి రెండు చేతులా నమస్కరించవచ్చు... ఇక ఈ సీజన్లో ఖర్మ కాలి అడ్మిషన్లు కాలేదనుకోండి... నీ వల్ల ఇంత వరకు ఒక్క అడ్మిషన్ కూడా లేదు  అని మీటింగుల్లో నిలదీయడాలు....!!!
ఒక్క క్షణం... ఈ ఉపాధ్యాయుడి ఆవేదన వినండి..
ఉద్యోగం అంటే నెల నెల వచ్చే జీతం... సామాన్య ప్రజలం ఈ జీతం తోనే కుటుంబాన్ని పోషించాలి...కాని ఎక్కడ ఎవరికి జరగని అన్యాయం మాకు  జరుగుతుంది.
------------------------------------------
పేరెంట్స్ దగ్గర 12నెలల ఫీజులు & స్టడీ మెటీరియల్స్ & నోట్ బుక్స్ & బెల్టులు బ్యాడ్జ్ లు & బస్ ఫీజులు అదనం & ఇలా గ్రామం నుండి పట్టణాల వరకు అన్ని ప్రైవేటు స్కూళ్ళ ల్లో.. ఓ పెద్ద పాటి దుకాణం లే నడుస్తూ ఉంటాయ్.
ఏ టీచర్ ఐతే.. ఒక్క మాట ఐనా మేనేజ్ మెంటల్ వాళ్ళ తో వ్యతిరేకం గా మాట్లాడితే... వాళ్ళ ని ఏదో వంక పెట్టి తీసివేస్తారు...
ఇలా చెప్పుకుంటే హనుమంతు ని తోక అంత ప్రాబ్లమ్స్ తో ప్రైవేటు టీచర్స్ వెట్టి చాకిరీ ని అనుభవిస్తున్నారు.
  ఒక సంవత్సరంలో 12 నెలల జీతం ప్రతి పని చేసే వారికి ఉంది.. కానీ మా బ్రతుకులు అద్వానం...ఒక సంవత్సరంలో కేవలం 8 లేక 9 నెలల జీతం తీసుకుంటున్నాం ఎలా బ్రతకాలి, ఎలా కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకు చదువు ఎలా వారి భవిష్యత్తు కలలు ఎలా నెరవేరుస్తాం..ఒక గురువు కి ఈ సమాజంలో జరుగుతున్న గొప్ప గౌరవం..
ఏప్రిల్  మే నెలల్లో జీతాలు గతి వుండవు కనుక స్పాట్ వాల్యూవేషన్ కోసం నానా తంటాలు
ఈ గురువుల భాధ ఎవరికి అక్కర్లేదు, మీకు నిలబడి విద్యాబుద్ధులు నేర్పి ఇక్కడే నిలబడి పోయే మా జీవితాలకి అర్థం లేకుండా పోతుంది...ప్రతి పనికి కష్టం మరియు ఫలితం ఉంటాయి కాని మాకు మాత్రం కష్టం మాత్రం ఉంది ఫలితం శూన్యం...మా కష్టం ఎవరికి పట్టదు
ఇన్ని కష్టాలున్న ఈ ఉన్నత ఉద్యోగానికి మున్ముందు ఏ ఒక్కరూ వచ్చే ధైర్యం చేయరు..
అయ్యా ముఖ్యమంత్రి గారు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం చేసే వారే గురువులా?
మమ్మల్ని ఏమంటారు.. మా బ్రతుకు భాదలు మీకు తెలియదా..
అయ్యా మేము ఉద్యోగం ఉన్న నిరుద్యోగులం.
ఎడారి లో ఎండమావులం.
అనుభవం తప్ప ఏమీ
సంపాదన లేdu!
ఈ పోస్ట్ ని షేర్ చేసి  గురువు భాధని...ఈ ప్రవేటు యాజమాన్యాలకు, మన  తెలుగు   ప్రభుత్వాniki తెలియజెప్పు...
ఇట్లు
నవీన యుగపు
విద్యావంతుడైన
వెట్టి చాకిరీ జీతగాళ్ళు
( ప్రయివేటు ఉపాధ్యాయులు )
------------------------------------------
దయచేసి... పేరెంట్స్ & ప్రైవేట్ ఉద్యోగులు అందరూ...దీన్ని షేర్ చేయండి. ఈ అన్యాయాలను.. దుర్మార్గపు యాజమాన్యంల గురించి మీ వంతుగా ప్రచారం చేయండి. ప్రభుత్వాలు నిజానిజాలను తేలుసుకొని తగు చర్యలు తీసుకొనేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి.

లక్షలాదిగా పనిచేస్తున్న..ప్రైవేటు స్కూల్స్ లో & కాలేజీల్లో పనిచేసే టీచర్స్ కు గవర్నమెంట్ నిరుద్యోగ భ్రుతిని ఇవ్వాలి?!

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...