Wednesday, October 18, 2017

మీరు సులభముగా చేయగల సాయమిది

మీరు సులభముగా చేయగల సాయమిది
విక్రమ్ భయ్యా వ్రాయునది...
ఈ క్రింద రంగులో వున్నది చదవండి. కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సరిగా లేక ఇబ్బంది పడుతున్న చెల్లెల్లెందరో వున్నారు. ఈ క్రింద వ్రాసినది..వారిలో 'పుస్తక విక్రయాల ద్వారా' కాస్త ఆర్ధిక స్వావలంబన సాధించాలనుకునేవారిని ఉద్దేశించి

అన్నయ్య వ్రాయునది....
మంచి పుస్తకాలను చదివించే అలవాటు సమాజములో పెరిగిననాడు ఏన్నో సమస్యలకు అడ్డుకట్ట పడును. ప్రయాణ సమయాల్లో కోట్లమంది ఏవో పాటలు వింటూ / అనవసర విషయాలు మాట్లాడుతూ కాలాయాపన చేస్తుండటము వల్ల దేశము విలువైన 'పనిగంటల్ని' కోల్పోతున్నది. తొలిదశలో మీరు రామకృష్ణ మఠం వారి పుస్తకాలను 'మీ ఇంటి చుట్టుపక్కల/ మీ వీధిలో/ మీ & మీ మిత్రుల విద్యాలయములలో/ రైలు_బస్సు ప్రాంగణాల్లో/ రైలు_బస్సులో తదితర చోట్ల' ప్రచారము_విక్రయము చేస్తానంటే...'పడాయీ' తరపున మీకిదే స్వాగతము. భారతీయ భాషల వినిమయాన్ని ప్రోత్సహించడము/ సద్భావాలను పెంపు చేయటము లక్షము.
పుస్తకాలు రూ 1 నుండి మొదలుకొని రూ.  150 వరకు వెల కలిగి వుంటాయి. మీరు ప్రధానముగా రూ. 20 లోపు ఖరీదు చేసే ఉపయుక్త పుస్తకాలపైన దృష్టి పెట్టవచ్చు.
మీ చదువుకు ఆటంకము లేకుండా చూసుకోగలరు.

మీకు 'ఇంటర్న్ శాల' వేదిక ద్వారా మాట ఇచ్చిన విధముగా నెలకు  రూ. 3000+ విక్రయాలపై 10% (గరిష్ఠ అమ్మకపు వెలపై) చెల్లించగలము.  మీరు నెలకు కనీసము రూ. 10,000 విలువ చేసే పుస్తకాలు విక్రయిస్తారని భావిస్తున్నాము. ఒకవేళ మీరు రూ. 10000కు పైబడి విక్రయిస్తే...ఆ అదనపు అమ్మకాలపై 30% మీకు చెల్లించబడును.  ఇలా రెండు నెలలు. ఆపై సంగతి అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచిద్దాము. మీరు భారతీయేతర భాషల పుస్తకాలు/ పక్కదారి పట్టించేవి ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు చూపరాదు/ విక్రయించరాదు. మీరు పుస్తకాలు విక్రయించేప్పుడు మీ గౌరవమర్యాదలకు లోటు లేకుండా చూసుకోగలరు. ఆత్మవిశ్వాసముతో మెలగగలరు. మీరు సిద్ధముగా వున్నామంటే .. కార్తీక పౌర్ణమి నుండి మీ 'ఇంటర్న్ షిప్' మొదలైనట్లు!
'Shakuntala devi puzzles'/ 'physics in daily life -perelman'/  వంటి కొన్ని ప్రత్యేక పుస్తకాలకు మినహాయింపు వున్నది.

రామకృష్ణ మఠం వారి ప్రచురణలు కాకుండా 'గీతా ప్రెస్ / సంస్కృత భారతి / సాహిత్య నికేతన్ / విశాలాంధ్ర ప్రచురణలు/ భారత ప్రభుత్వ ప్రచురణల విభాగము తదితర సంస్థల నుండి వెలువడే పుస్తకాల్లో ఎంపిక చేయబడిన 'ఉదాత్తమైనవాటిని' విక్రయించవచ్చు. భారతీయ భాషల్లో లభించే 'అబ్దుల్ కలాంగారి పుస్తకాలను చదివేలా' ప్ర్రోత్సహించాలి. వీటి విక్రయాలపై 10% కన్నా ఎక్కువ ఇస్తానని మీకిప్పుడు హామీ ఇవ్వలేను.
హైదరాబాదులో 'విదేశాలవారు కూడా ఉన్నారు కనుక..అలాటివారికి మాత్రము 'ఆంగ్ల ప్రతులు' మరీ అవసరమైతేనే మన సంస్థ ద్వారా అందించాలి. అలాటివారికి మనము 'రామకృష్ణ మఠం' చిరునామా ఇస్తే చాలు!!
వీలైనంతవరకు 'డిజిటల్ లావాదేవీలు' జరిగేలా చూద్దాము. మీకు 'పడాయీ' తరపున చెల్లించబడే పైకము 'బ్యాంకు' ద్వారా మాత్రమే చెల్లించబడును. తొలి విడతగా కార్తీక పౌర్ణమికి రెండు రోజుల ముందుకల్లా మీకు రూ. 2000 విలువచేసే పుస్తకాలు & రూ. 1000  అందజేయబడును.

శుభం భూయాత్

మీరెలా సాయపడాలంటే...
ఇంటర్న్ షిప్ చేయాలనుకుంటున్నవారితో వీలైనంతవరకు నేను నేరుగా సంప్రదింపులు జరపను/మాట్లాడను కనుక మీ ఇంట వున్న మా చెల్లెలి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయాలి. సుమారు ఐదువారాలకోసారి...'ఇంటర్న్ షిప్' చేస్తున్న విద్యార్థినులతో సంప్రదించటం/ పుస్తకాలు (బరువు 20కిలోలకన్నా తక్కువే!!)అందించటం_స్వీకరించటం చేయాలి. అంతే! మీకు లాభమేమంటే...ఎన్నో మంచి పుస్తకాలు మీరు ఉచితముగా చదువుకోవచ్చు.

--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only. 
మెదడుకు పదునుపెట్టే ఆటవస్తువులు కొనాలంటే To buy science based games/ toys..www.arvindguptatoys.com
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.

No comments:

Post a Comment

Your private information has been stolen because of suspicious events.

Greetings! Would like to introduce myself - I am a specialized hacker, and have succeeded in hacking your operating system. At this mo...