नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/
ఏ ఉద్యమాలు చేసినా దేశ సమైక్యతకు అందరూ కట్టుబడాలి. బాధ్యతారాహిత్యముగా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించరాదు.
ఆటవెలది పద్యాలు
దార్శనికులు కలిగిన నాయకులపాలనలో సమైక్యాంధ్రప్రదేశ్ వల్లనే సమస్యలు పరిష్కారమగును. 2018లో వివిధ పార్టీలు/ సంఘాలు ఐకమత్యములేక ఎవరికి తోచినది వారు చేస్తూ ఒంటెద్దుపోకడతో వున్నచో 'అభివృద్ధి (/వెలుగు)' ఎలా సాధ్యం? కేంద్రము నుండి ఫలానా లబ్ది రాష్ట్రానికి కలగాలని నిజాయితీగా కోరుకున్నట్లైతే..'మా ఘనత వల్లే ఫలానా మేలు జరిగినది' అని గొప్పలు చెప్పుకునే నైజం వీడగల్గితే..అప్పుడు అది నెరవేరును.
1. ఎవరిదారివారు ఎట్టెట్టొ పోరాడ
2. వెలుగుకానరాదు..వెలితిపోదు!
3. చిత్తశుద్ధికలిగి చిరుయత్నముసలుప
4. కార్యసిద్ధి కలుగు.. కలిమి హెచ్చు!
----
ఓ ఆర్ధిక మంత్రీ! అధిక నిధులివ్వటము యిబ్బందికరమని(వేరే రాష్ట్రాలవారూ అడుగుతారు కనుక)/ కుదరదని చెప్పకయ్యా! బలహీనముగా వున్న బిడ్డకు తల్లి ఎక్కువ పోషకాహారమిడు విధంబున..అవసరములో వున్న రాష్ట్రాలకు తగిన(/అధిక) నిధులీయవయ్యా!
1. కరిపురంబునేలు కమలదళాధిప
1. కరిపురమునవున్న కమలదళాధిప
2. కరుణ జూపవయ్య కష్టమనక!
3. అర్భకునకు తల్లి అన్నమెక్కువబెట్టు
4. విధమునరసిమెలగు విత్తమంత్రి!!
4. విధమునరయవయ్య విత్తమంత్రి!!
--
మనిషి తినవలసినది శాకాహారమే. Human being should eat vegetarian food only.
During travelling..play with rubic cube/ sudoku/ Chess; or discuss quantitative aptitude.
No comments:
Post a Comment