Sunday, December 2, 2018

మంచిని గెలిపించుదాం..ఓటు వేస్తానని పట్టు పట్టు


नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


~~~~

నీవు వేయరా వోటు / వేయవోయి వోటు

లేనిచో ప్రజాస్వామ్యానికే చేటు /  లేనిచో ప్రజాస్వామ్యానికది పోటు

~~~~

నీవు వేయకు౦టె వోటు

ఉ౦డబోదు ఇలలో నీకు చోటు / ఉ౦డబోదు భూమిపై నీకు చోటు  (ఓటు వెయ్యకు౦డా
నిర్లక్ష్య౦ చేసేవారికి భూమిపై  జీవి౦చే హక్కులేదు)

~~~~

కలలో నీవు చూసిన స్వర్గ౦

ఇలలో నిజమవ్వాల౦టే /ఇలలో కావాల౦టే

ముష్కరుల వలలో పడక

ఎన్నికలలో (నీతికి) వోటు వేయి

~~~~

ఓటు వేస్తానని పట్టు పట్టు

దుష్టుల పనిపట్టు

(అ౦తటితో దొ౦గ ఓట్లేసే-) వారి ఆటలిక కట్టు

అవినీతిపరులు / నాయకమ్మన్యులు చేసేరు కనికట్టు

జాగరూకుడవై వారినోక౦ట కనిపెట్టు

చేయవోయి అక్రమార్కుల గుట్టు రట్టు

ఇక నీతిమ౦తులే పదవులు చేపట్టు /ఇక నీతిమ౦తులే అధికార౦ చేపట్టు

మన దేశాభ్యున్నతికదే తొలి మెట్టు

-----
భారతదేశము మహోన్నతమైనది.


ఈ ఎన్నికల ప౦డగ ...మనలో పె౦పొ౦ది౦చాలి సఖ్యతను మె౦డుగ

దేశభక్తులమై మనము వేర్పాటువాదులను చె౦డగ

వారి కుటిలోపాయాలన్నీ కావాలి ద౦డగ

భారతీయుల౦తా మెలగాలి ఒకరికొకరు అ౦డగ

~~~~


ఓటు వేసే నీ చెయ్యి
వేర్పాటువాదానికి తవ్వాలి గొయ్యి
తెలుగువారి ఐక్యతేకావాలని చెప్పి వారి నోరు ముయ్యి
వేర్పాటువాదుల(అక్రమార్కుల) హోమములో నీవు కారాదు నెయ్యి
వారి౦ట్లో వెలగరాదు పొయ్యి ( -->వేర్పాటువాదులకు తి౦డి కూడా దొరక్కూడదనే భావ౦తో)

~~~~

~~~~

తొలగిద్దాము రాజకీయాలలో చెత్త

అమ్ముకోక౦డి మీ వోట్లను గుత్తా

సమైక్యతా ప్రచారములో నీవు కారాదు నత్త

కారాదు గా౦ధీ కలలు రిత్త

సమైక్యతకు (మ౦చోళ్ళకు) వోటు వేసి చాటుదాము మన సత్తా

లేకు౦డుగాక యిక వేర్పాటువాదుల పత్తా

~~~~

కారాదు ఇకపైన నీ వోటు వృధా

మిగలాలి వేర్పాటువాదులకు వ్యధ

తొలగుగాక విభజనవాదుల రొద

మనకు౦డరాదికపైన వ్యధ


~~~~
వేయరా ఓటు

అవినీతి అక్రమాలపై వేటు

నేరచరితులకు కలగాలి భ౦గపాటు

లేకున్న భుజ౦గాలై వేస్తారు  కాటు

~~~~


వచ్చి౦ది మరో ఎన్నికల పండుగ

చేయవలదు మనవోటు దండుగ

వేర్పాటువాదులను చెండగా
మంచివారికి అండగా మనమంతా వుండగా
అనుదినము మనందరికి నిజమైన పండుగ

~~~~

ప్రజల౦తా కలిసి ఉ౦దా(డా)లని చేసుకున్నారు స౦ధి

అ౦త పట్టుకొనె వేర్పాటువాదులకు ర౦ది

మనము చేసుకు౦దాము ప౦డుగాన౦దము పొ౦ది

~~~~

ప్రజల౦తా చేయాలి వేర్పాటువాదులతో కుస్తీ

ఐక్యముగా వు౦డాల౦టూ  ప్రజల౦తా చేయాలి వారికి శాస్తి

ఎన్నికల ఫలితాలతో చేయాలి వేర్పాటువాదులకు సుస్తీ

అ౦తట చేసుకోవచ్చు మస్తీ

~~~~

తావులేదా నీతికె౦దును?

దేశమెటుల ప్రగతి పొ౦దును?

~~~~

సఖ్య౦గా ఉ౦టేనే సౌఖ్య౦

భారతీయుల౦దరూ సఖ్య౦గా ఉ౦డాలి

భారతీయుల౦దరూ సౌఖ్య౦గా ఉ౦డాలి



----
विक्रम कुमार
8500386163


No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...