Sunday, April 28, 2019

విషయ 'వాసనల' నుంచి విముక్తి

సత్యమును పలుకవలెననెడి నియమము కలిగియుండుట వలన వాసనల గూర్చి విశదీకరించుచుంటి..

యోగా సాధకులయెడ అన్యులు ఏ విషయమైనా దాచగలరా? ప్రకృతికి దగ్గరగా జీవించే 
వారికి 'వాసన'  పసికట్టడం సులభం. మనిషికి వుంటున్న దుర్లక్షణాలు కొరవడికదా... పశుపక్ష్యాదులు భూకంపం వంటివాటిని ముందుగా పసిగట్టగలుగుతున్నవి. ఫినాయిల్/ కర్పూరం కంటికి కనిపించకున్నా వాటి జాడ కనిపెట్టే అమోఘ ఆఘ్రాణశక్తియుతులకు...శరీర సంబంధమైన వాటిసంగతి వేరొకరు చెప్పవలెనె?

 
ఒక గదిలోకి  బయటినుంచి  వచ్చే వారికి 'తేడా' తెలుసుకోవటం ఎంతపని? అక్కడే చాలాసేపు వున్నవారు దానికి అలవాటు పడివుండుటవలన లేక 'అది ఒక పెద్ద విషయంగా' పట్టించుకోకపోవడం (అంతకన్నా ముఖ్యమైనవి వున్నందున/) వలన తేడా పట్ల 'తమకు సంబంధం లేదన్నట్లు' వుంటారు!


నేటికాలమున 'సామాన్యులుగా' పరిగణింపబడేవారి శరీరము దుర్గంధమును వెలువరించును అని మీకు తెలుసు. (పరిశుద్ధాత్మ కలవారి సంగతి వేరు!)

నిద్రలో వున్నవారు చచ్చినవారితో సమానమందురు. అట్టి యెడ నిద్రలో తన ప్రమేయం లేకుండా  జరిగే శరీర ప్రక్రియలకు తనను బాధ్యత వహించాలని అనటం అన్యాయం అని ఒకతను అన్నాడనుకో...ఇక తనకు ఏంచెప్పి ఏం లాభం?!


వ్యక్తుల నుంచి భౌతికముగా దూరమవటంవలన నాసికకు వాసన సోకకుండా చూసుకోవచ్చు...కానీ..
మనసులో బంధాలు (/రాగద్వేషాలు) తొలగించుకోనంత వరకు సమస్య వున్నట్టే.
 
'నా' కారణంగా ఇతరులకు అసౌకర్యం కలగకుండా వుండాలి అన్న స్పృహ అందరికీ వుంటే..అది వాస్తవ రూపుదాలిస్తే  ఎంత బాగుండేది! 

ఉత్కృష్టమైన సత్యవాక్పాలనమనే సుగుణము నుండి ఉత్పన్నమయ్యే సువాసన తక్కిన వాటిని అధిగమించుగాక.

ఇక ఈ విషయంపై చర్చ ఇక్కడితో ఆపితే... జీవితంలో మిగిలిన అతి కొద్ది పాటి సమయాన్ని   మరింత ముఖ్యమైనవాటిపై దృష్టి పెట్టవచ్చు.

ప్రస్తుతానికి చెప్పగలిగింది ఒక్కటే....
త్వరలో (వివిధ/ విషయ) వాసనల నుంచి విముక్తి కలుగుగాక. 

శుభం భూయాత్


No comments:

Post a Comment

Pending for payment.

Greetings!<br> Have you seen lately my e-mail to you from an account of yours?<br> Yeah, that merely confirms that I have gain...