Wednesday, July 3, 2019

బిసిటి_మహీంద్రా సామాజిక బాధ్యతగా...


नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


భారతదేశంలో జనాభాకు కొరత లేదు..ఉన్నసమస్యల్లా నైపుణ్యము కలిగినవారు తగినంత మంది లేకపోవటమే అనేది మనము తరచూ వింటున్నాము...అంతేనా? ..నిజజీవితంలో అనుభవంలోకి వస్తూనే వుందది! విద్యాలయల్లో సాధారణంగా బోధిస్తున్న అంశాల్లో తగిన పట్టు సాధించక ఆపై ఉద్యోగాలకు అర్హత సాధించలేక చతికిలపడుతున్నవారు కోకొల్లలుగా కనిపిస్తున్న తరుణంలో సామాజిక బాధ్యతగా భాగవతుల ఛారిటబుల్ ట్రస్టు మహీంద్రా కంపెనీవారి సౌజన్యముతో...యువతకు తగిన శిక్షణనిచ్చే బృహత్కార్యాన్ని చేపట్టటం ముదావహం.

విశాఖపట్నం  ఆటోనగర్ లో 13-5-19న విద్యార్థులలో/ ఉద్యోగాన్వేషణలో వున్న మరికొందరిలో స్ఫూర్తినింపే అవకాశం మాకు (విక్రమ్ భయ్యా & అభిలాష్) కల్పించినందుకు ధన్యవాదములు. గణీతముతో గమ్మత్తులు/ శాస్త్ర ప్రయోగాలు చేసి చూపటం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసము పెంచాలన్నది మా అభిమతము. ఆ విషయములో మేము కృతకృత్యులమైనామని అనతికాలముననే తెలియగలదు.

శిక్షణా సంస్థ బాధ్యతలు చూస్తున్న  సురేశ్ గారు తదితర సిబ్బంది & అమితాసక్తితో పాల్గొన్న 'విద్యార్థుల'  సహకారముతో .. కార్యక్రమము జయప్రదమైనది. అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులిచ్చి కొందరు విద్యార్థులు పుస్తక బహుమతులు గెల్చుకున్నారు. భౌతికశాస్త్ర సూత్రాలను సులువుగా ఆకలింపు చేసుకునేలా www.arvindguptatoys.com నమూనాలో అభిలాష్ చూపిన ప్రయోగాలు; విక్రమ్ భయ్యా నేర్పిన లెక్కల చమత్కారాలు / ఎలక్ట్రానిక్స్ ప్రయోగాలు శ్రద్ధపెట్టినవారిని అలరించాయి. చెప్పినమాకు సంతృప్తి కలిగించాయి. ఎంత పెద్ద చదువులు చదివినా దేశం గురించి పట్టించుకోకపోతే లాభమేమి?  దేశ సమైక్యతకు దోహదం చేసే భారతిలిపిని (www.bharatiscript.com) పరిచయం చేయటం  &  స్వయం ఉపాధికి తగిన బాట చూపటం జరిగింది.  మరీ ముఖ్యముగా 'సమయాన్ని సద్వినియోగం చేసుకునే చిట్కాలు' అందించితిమి.

ఇక నిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేసినారు. గడియగడియకూ 'ఆహారంగా' ఏదో ఒకటి అందిస్తూనే వున్నా...సున్నితముగా వాటిని తిరస్కరించాల్సి వచ్చింది (హనుమంతుడు సముద్ర లంఘనం చేసినప్పుడు మైనాకుడు ఆతిథ్యమిస్తానన్నప్పుడు ఆంజనేయుడు సమాధానపరచిన విధముగా)...మరి పాఠం చెప్పటానికి అవి అవరోధాలే కదా! వారు సైతం పట్టు విడువక కార్యశాల ముగిసిన పిమ్మట 'భారీగా' శుద్ధ శాకాహార భోజనమేర్పాటు చేసినారు! ప్రయోగాలు చేసి చూపటానికి అవసరమైన పరికరాలను అప్పటికప్పుడు కొనుగోలు చేసితెచ్చిన అధ్యాపకునికి ప్రత్యేక ధన్యవాదములు. కర్నాటక నుండి వచ్చి తమ్ముడు చాలా చురుకుగా వున్నాడు.

 

సమయాభావం వల్ల ఎక్కువ ప్రయోగాలు చూపలేకపోయామన్న బాధతో...మంచి స్పందన లభించిందన్న సంతోషముతో.. అతి త్వరలో మరోమారు తప్పక తిరిగివచ్చి మరిన్ని మంచి అంశాలు నేర్పగలములే అన్న ధీమాతో..ఇలా మిశ్రమ అనుభూతులతో అక్కడినుండి బయలుదేరితిమి.

 

vikrambhayya@gmail.com 8500386163

 


For MATLAB/ Arduino_Robotics/ Mathematical magics workshop at your college mail to vikrambhayya@gmail.com.
Some video lectures can be seen at: http://padaayi.blogspot.in/p/blog-page_27.html

----
विक्रम कुमार
8500386163


No comments:

Post a Comment

Pending for payment.

Greetings!<br> Have you seen lately my e-mail to you from an account of yours?<br> Yeah, that merely confirms that I have gain...