Saturday, November 21, 2015

ఇటీవల వ్రాసినవాటిలో కొన్ని పద్యాలు

తెలుగువారు కలిసి తెలివిగ మసలగ
భువియె స్వర్గసీమ; బుద్ధిలేని
వారె వేర్వడంగ వాగుచుండుదురట్టి (/ వాగుచుండెదరట్టి)
తుంటరుల గళములు తుంచవలయు

౨౦-౧౧-౧౫ ౦౯:౦౦ దుష్టులు ఏవేవో కల్పించి చెబుతుంటారు. వాటితో గతితప్పక, సమైక్యతకు పట్టం కట్టాలి. వేర్పాటువాదుల(గళము)ను అణిచివేయాలి
-----------------
చేయదగినవేవి? చేయకూడనివేవి?
ఏది మేలు చేయు? ఏది కీడు
సలుపు? తెలియపర్చు సర్వజనులకీవు
వేదవిద్య నేర్వు వేగిరమున
(/వేదవిద్య నేర్పు వేగిరముగ)
౧౯,౨౦-౧౧-౧౫ ఒక వ్యక్తికి అతని కర్తవ్యమును బోధిస్తూ హితైషి యిట్లు పలికె....నీవు త్వరగా వేదవిద్య నేర్చుకో. అంతట ఏవి జగమునకంతటికీ మంచి చేయునో, ఏవి కీడు చేయునో ప్రజలకు చెప్పవలె.
ఇతరులకు వేదవిద్య నేర్పుట నీ కర్తవ్యమని కూడా భావించవచ్చు

--------------------
కాకరకాయ  వండు (/వండె) కార్తీక మాసాన;
కాయమునకు మేలు కలుగు తినగ;
నాటురకము శక్తి; నాశనమొనరించు
సంకరములు తినరు సంతులెపుడు (/సాధు జనులు)
జన్యుపరివర్తిత పంటలతో మనవైన దేశీయరకాలకు సవాలు విసిరే కుటిలాత్ముల ఆగడాలకు అంతం పలకాలి.
మంతెన సత్యనారాయణ వంటి వారు ప్రచురించే వ్యవసాయ /ఆరోగ్యపరమైన పుస్తకాలకు ప్రచురణకై పంపాలి
------------------
పెద్దవానవచ్చె  పేదోళ్ళకిబ్బంది
తెచ్చె ; తిండి లేదు! తెరపి లేక
కురియు వానవలన కూలెనిళ్ళెన్నెన్నొ
కలతదీరునెపుడొ కనగరాదు
చెన్నై నెల్లూరు తదితర ప్రాంతాల ప్రజలు వానలు వరదలతో ఇక్కట్లు పడుతున్నందున...సాధారణ పరిస్థితులు నెలకొనేదెప్పుడో అని జనము అనుకుంటున్నారు. మరోలా ఆలోచిస్తే... ప్రభుత్వాలు తూతూమంత్రముగా తాత్కాలిక ఏర్పాట్లేవో చేసి ప్రస్తుతానికి మమ అనిపించినా..మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి ముప్పు వస్తే ఎలా? అసలు శాశ్వత పరిష్కారమెప్పటికి అని ప్రజలు తలస్తున్నారు.
---------------
రాజధానిమార్చ రాజుగ వున్నోడు
వురకలెత్తుచుండె వుత్సహించి
తప్పుదారిబట్టి తాసలిపినపని
ఉచ్చు బిగియకున్నె ఊరు వదల?
ఓటుకు నోటు వంటి వ్యవహారముల నుండి తప్పించుకోవడానికే హైదరాబాదు  నుండి ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నాడని ప్రతిపక్షాలంటున్నవి. హైదరాబాదు తెలుగువారందరిదీ. జై విశాలాంధ్రప్రదేశ్. ఇక్కడే వుంటూ సమైక్యతకు దోహదము చేసేలా బాబు ఎప్పుడు ఆలోచన చేయునో?



Monday, November 16, 2015

హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట ... సిగ్గుచేటు!

నిన్న దినపత్రికలో పోలీసు పెద్దాయన చెప్పె.. హైదరాబాదులో లక్ష కెమెరాలు పెడతారట...ఎవడబ్బ సొమ్ముతో? కెమెరాలమ్మే విదేశీ కంపెనీలకు పండుగే... మనకా ఖర్చు దండగే!!   ఇదేనా అభివృద్ధి? ఇక్కడ నాశనము చేసినది చాలదని ఇప్పుడు  33,000 ఎకరాలపై పడతారట! అసలు నేరాలకు మూలకారణమైన మద్యమును నిషేధించి పకడ్బందీగా  అమలుచేయాలన్న ఇంగితము లేదే? విశృంఖలముగా చెలరేగి బుద్ధి చెడగొడుతున్న చలనచిత్రాలు / ప్రసారసాధనాలకు/ వాణిజ్య ప్రకటనలకు/ మతమార్పిడులకు   అడ్డుకట్ట వేయరే? గుడికి వెళ్తే ...దొంగలున్నారు జాగ్రత్త అని వ్రాస్తున్నారంటే మరి నాగరికులు ఏమి సాధించినట్టు?   అమాయక ప్రజలను పక్కదారి పట్టించడానికి ..ఇన్నిన్ని కెమెరాలు పెడుతున్నామని హడావిడి చేస్తేసరిపోదు. హెల్మెట్ విkraయములోnoo ఇదే తంతు!! ప్రజలు మృత్యువాత పడుతున్నారని ప్రభుత్వాలు నిజముగా అంత బాధపడుతున్నాయా? మరి >100కిమీ వేగముతో వెళ్ళే ద్విచక్రవాహనాలను ఎందుకు తయారుచేయనిస్తున్నట్టు ? సామాన్య ప్రజల అవసరాలకు అంత వేగమెందుకయ్యా  వెఱ్ఱి కాకపోతే! వాహనాల తయారీదారుల డబ్బుదాహానికి అమాయక ప్రజలు బలయిపోతున్నారే...   రోగానికి అసలు మందు వేయాలి. బాధ్యతగల పౌరుల సహకారముతో నేరాలను అరికట్టడానికి పెద్దయెత్తున ప్రయత్నము జరగాలి.   

----
పద్యాల విక్రమ్ కుమార్
(8331926163 always BSNL)

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...