మహిళ యెచటనొందు మర్యాదమన్ననల్
మనునచట దివిజులు మాన్యచరిత!
నీదు రాజ్యమందు నీతివర్తనమున
జనులు మెలగ కలుగు జయము శుభము
కొత్తగా ప్రజాప్రతినిధిగా (సాధారణ ప్రజలు సైతము తమ దేశ ప్రతినిధులమే అన్నస్ఫృహతో జీవనం సాగించాలి)/ నేతగా/ రాజుగా ఎన్నికైన వ్యక్తికి ఒక పెద్దాయన యిలా చెబుతున్నాడనుకోవచ్చు....”మనసా వాచా కర్మణా ఏ ప్రాంత ప్రజలైతే అతివలను గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు ...ఆ ప్రజలు చేపట్టే పనులు జయప్రదమగును / శుభము చేకూరును.''
నేటికాలపు ప్రచార/ ప్రసార మాధ్యమాల్లో ...."నీతులు చెప్పడము" చూస్తున్నాము....మనసు నుండి వచ్చినవి కావవి...ఆచరణలో వారు పెట్టరైరి. నిజముగా తల్లిని చెల్లిని సమాదరించేవారైతే... నేటితరం సినిమా పాటలు వినరు/చూడరు!! అలాంటి అవాంఛనీయ విషయాలు సమసిపోయేలా ఉద్యమిస్తారు. This is a litmus test for a person's character. మందు దుకాణాలు పెట్టిన ఇద్దరు చంద్రులూ నేడు వేదికలనెక్కి మైకులో వాగుతారు...మొసలి కన్నీరు కారుస్తూ...అబలలకు అండగా వుంటామని!!
No comments:
Post a Comment