కొన్ని రోజుల్లో వెళ్ళిపోనున్న సంవత్సరము చేదు సంగతులే మిగిల్చినది. రానున్న వత్సరము మాత్రము దుఃఖాలను దూరము చేయునా?(ఈ అనుమానానికి కారణము...ఆ రానున్న వర్షమునకు వ్యవహారముగా వున్న పేరు భయానకముగా వుండుటయే....)
౧. చేదు అనుభవములె చెన్నపురికిగల్గె
౨. జారనున్నయేట జాడలేదు
౩. మధుర క్షణములకు; మరి వేగవచ్చెడి
౩. (మంచి వెదకి జూడ; మరి వేగవచ్చెడి)
౪. దుర్ముఖెట్లు బాపు దురితములను?
------------------------
సంవత్సరాలకు ఏ దురాత్ముడు పేర్లు పెట్టెనో కదా? మంచి పేర్లే లేవా పెట్టుటకు? పాడు పేర్లను మార్చేద్దాం...
౧. ఎవరుబెట్టె పేర్లు ఎకసెక్కముగాను?
౨. పేర్లు వుండరాదు పేలవముగ;
౩. నష్ట దుర్ముఖి ఖర నామములను మార్చి
౪. వెలుగు నింపవలెను వేగిరమున
-------------------------
ఎల్లప్పుడూ మనము మంచినే తలచాలని పెద్దలు అంటారు కదా ..అందుకే... ’బియ్యం నిండుకున్నాయి’, ’బాల్చీ తన్నేశాడు’ వంటివి వాడెదరు. అలాంటి మన సంప్రదాయములో... కొన్ని సంవత్సరాలకు చెడు పేర్లు ఎలా చొరబడ్డాయి? ఆ పేర్లను నేను నచ్చను/ మెచ్చను.
౧. మంచికోరవలెను మనిషి యెల్ల సమయా
౨. లందు అనెడి సూక్తులందు భక్తి (/శ్రద్ధ)
౩. లేక యెవడొ చెనటి లేకితనంబున
౪. యిడిన పేర్లు నేను యిచ్చగించ
---------------------------
కిందనున్నది ఛందో నియమాలను పట్టించుకోకుండా వ్రాసినది....
కాలము భగవత్స్వరూపంబనుట నిక్కమేని
పేరు విన్నంతనె హడలజేసెడు
దుర్ముఖి ఖర నామములేలొకొ?
మంచి పేర్లు లేవె ముదమార బిలుచుకొనగ?
పద్యాల విక్రమ్ కుమార్
No comments:
Post a Comment