ఉగాది పద్యాలు
ధాత్రి శోభనొంద, ధర్మము ఠీవీగ
నాల్గుపాదములతొ నడువజేయ
కోర్కె జనులకిలను; కొత్త వత్సరమున
వాన వలయుగాని వరదవద్దు (/వరదలొద్దు)
------------------------
తగిన వేళలందు తగినన్ని వానలు
కురిసెనేని ప్రజకు కుశలమగును
స్వాగతింతుమమ్మ,స్వాంతన చేకూర్చు
కొత్తవత్సరమ్మ, కోర్కె యిదియె (/వొకటె)
------------------------
స్వాగతింతుమమ్మ,స్వాంతన చేకూర్చ
వమ్మ; కురియజేయి వాన తగిన
వేళలందు; అంత వేడుకగా వుండు;
పుడమి జీవజాతి పులకరించు
(/పుట్లు యెన్నొ పండ పుష్టి కలుగు)
-----------------------------
విక్రమ్ భయ్యా (8500386163 (సదా బిఎస్ ఎన్ ఎల్))
No comments:
Post a Comment