Wednesday, January 31, 2018

సమాచార హక్కు చట్టాన్ని ’ రక్షకభట నిలయము & న్యాయస్థానము ’ లలో ఎవరెవరిపై..ఎలా ఉపయోగించాలో సెలవీయగలరు.


హైదరాబాదు ರಾజేంద్రనగర్ రక్షకభటనిలయములో విధులు నిర్వర్తించే ఎస్ ఐ మల్లికార్జున్ ('గారు' అనే గౌరవ సూచకానికి అర్హత కోల్పోయెను...అనైతికముగా ప్రవర్తించుటచేత) 2017ఏప్రిల్ లో 'విశ్వసనీయతలేని ఒకరు చేసిన ఫిర్యాదుని FIR గా నమోదు చేసెను'. అందులో నిందితులుగా పేర్కొనబడిన ఐదుగురిలో నలుగురికి విషయముతో సంబంధమే లేదు (నివసించే చోటు 'ఎక్కడెక్కడో దూరం దూరంగా వుండటం వల్ల). అన్యాయముగా తమ పేర్లు నమోదుచేయబడటం వల్ల వీరు & వీరి కుటుంబ సభ్యులు ఎన్నో విధాల ఇప్పటికే నష్టపోయారు..ఇంకా ఆ నష్ట పరంపర కొనసాగుతూనే వున్నది. ఋజుమార్గములో ఆరోపణల్లో వాస్తవమెంతో తెలుసుకోవాల్సినాయన బద్ధకముతోనో/ లంచాలకోసమో పనిని ఆలస్యము చేస్తూ...తనకు తోచినవి ఛార్జ్ షీట్ గా వ్రాసెను. నిందితుల్లో మొదటి ఇద్దరి చేత కొన్ని కాగితాలపై హడావిడిగా సంతకాలు పెట్టించుకొనెను...చదవడానికి తగినంత సమయమీయకుండా! ఆ పత్రాల నకలు ప్రతులు నిందితుల తరపు 'న్యాయవాదికి' 'త్వరలో' ఇస్తానని ఆ ఎస్ ఐ చెప్పిన మాటలు 'నీటి మూటలే అయ్యాయి'. తాను చేయాల్సిన పనులు సక్రమముగా సరైన సమయానికి చేయకపోగా...వివిధ దశల్లో డబ్బు ఆశించినట్లు/ తీసుకున్నట్లు 'న్యాయవాది (డబ్బులిచ్చినతణ్ణి ఇలా పిలవాల్సిరావటం అత్యంత విచారకరం!)' చెప్పెను. నిందితుల చేత 'సరిగా చదవకుండానే సంతకాలు పెట్టించుకున్న కాగితాల ప్రతులు ఇవ్వలేదు. ఇప్పటికీ ఛార్జ్ షీట్ 'నిందితులకు / వారి తరపున వున్న (అ)న్యాయవాదికి ఇవ్వబడలేదు. కానిస్టేబుల్ కూడా 'గడ్డి' తినెను. దారుణమేమంటే...నిందితులకు 'తగులుకున్న' 'న్యాయవాదులు' (మొదటాయన 'సరిగా' పనిచేయట్లేదని మరొకరిని పెట్టుకోవాల్సివచ్చె ) కూడా అక్రమ పద్ధతులకే మొగ్గుచూపుతుండట౦. వీరికి ఖర్చులూ ఎక్కువే అవుతున్నాయి!! నిజాయితీ గల లాయరును ఎలా పట్టుకోవాలో తెలియని స్థితి.     రాజేంద్రనగర్ కోర్టు కార్యాలయములో కూడా 'లంచాల వ్యవహారము' జరుగుతున్నది. డబ్బు ఇవ్వటం తప్పే. అలా ఇచ్చేలా సాక్షాత్తూ న్యాయస్థానం ప్రాంగణంలోనే పరిస్థితులున్నాయంటే...'పెద్దవారికి (న్యాయమూర్తులకు+...)' ఇవన్నీ తెలియవనుకోవాలా. దేశ గౌరవానికి హానికారకులైన ఇట్టివారిని సంస్కరించుటెట్లు? డబ్బు ఇచ్చినాక కూడా పని జరగట్లేదనేది మరో విశేషము. సమాచార హక్కు చట్టాన్ని ఇప్పుడు ' రక్షకభట నిలయము & న్యాయస్థానము ' లలో ఎవరెవరిపై..ఎలా ఉపయోగించాలో సెలవీయగలరు.

వయస్సులో పెద్దవారిని 'గారు' అని పిలవాలి సాధారణముగా..ఐతే ఈ లేఖలో పేర్కొన్న లాయర్లూ తమ మర్యాదను తామే మంటగలుపుకున్నారు).
లాయర్ రాఘవ & దశరథ్ (మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్/ వనస్థలిపురం )లు తమ ఫీజు నగదుగా ఇమ్మంటారు(బ్యాంకు ద్వారా వద్దాన్నారు)!! మొదటాయన ఎంత ఘనుడంటే...'absconDing'కి 'Not available' కి తేడా తెలియనంత!! వీరి వ్యవహారముతో సమస్య మరింత క్లిష్టమైనది...ఐతే ...దీనివల్ల 'చెత్తవాళ్ళు' ఇంకెవరున్నారో కూడా 'తెలిసివస్తున్నది'!!
ఉన్నత న్యాయస్థానానికి చెందిన లాయర్ నగేశ్వరరావు (పంజాగుట్టలో + మరోచోట కార్యాలయం)...అసత్యాల పుట్ట.
కోర్ట్ వద్ద కానిస్టేబుల్ కి లంచమివ్వాలన్నదితనే..తన సహాయకునిద్వారా ఇచ్చినదితనే
ఈ పెద్దమనుషుల గురించి 'అనుభవపూర్వకముగా' తెలిసింది కనుక వ్రాస్తున్నా. సామాన్యప్రజలు వారివద్దకు వెళ్ళి ఇబ్బందులు పడరాదని!! ఈ లాయర్లు ఫీజు డబ్బు తీసుకొని కూడా 'న్యాయబద్ధముగా' తమ పనులు నిర్వర్తించలేదు. అమాయకులైన నిందితులకు 'అధర్మమార్గము' నచ్చదని లాయర్లకు తెలిసి కూడా...ఆ లాయర్లే స్వయముగా 'తప్పుదార్లలో' పనులు చేస్తున్నారు....ఆ తప్పంతా 'ఇప్పటికే నిందలెదుర్కుంటున్న అమాయకులనెత్తిపైకి' రుద్దుతూ!! ఇది 'సేవా లోపమే కదా'. వినియోగదారుల ఫోరం కి వెళ్ళాలా? మరోచోట గోడు చెప్పులోవాలా. నిర్దిష్ట సూచనలు చేయగలరు. లాయర్ వాస్పరి రాహుల్ (వయస్సులో చిన్నవాడు...తనకూ ’సరైన పద్ధతిలో వెళ్తే ఖర్చు ఎంతగునో తెలియదో ఏమో?!) మరెవరో సీనియర్ లాయర్ ద్వారా సికింద్రాబాద్ కుటుంబ వ్యవహారాల కోర్ట్ కార్యాలయము నుండి కేసుకి సంబంధించి కొన్ని పత్రాలు తీసుకోవడానికి ’చాలా వేల రూపాయలు’ అధర్మముగా ఉపయోగించాల్సివచ్చెననె
దయచేసి న్యాయసంబంధ వ్యవహారాలను ప్రజల భాషలో...తెలుగులో నడిపించగలరు.

----
ధన్యవాదములు
----

पि. विक्रम कुमार
8331926163 (always BSNL)

No comments:

Post a Comment

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...