ప్రతిసారీ అంబులెన్స్‌కు దారివ్వాలని ప్రజలు ప్రతిజ్ఞ చేయాలని చిన్నారులు ఆన్‌లైన్‌లో సంతకాలు చేయిస్తున్నారు. 'అంబులెన్స్ దారివ్వండి' అని రాసున్న కారు స్టిక్కర్లనూ అందజేస్తున్నారు. దాన్ని చూసినప్పుడల్లా అందరికీ ఈ విషయం గుర్తొస్తుంది. 'అంబులెన్స్‌కు దారివ్వండి అనేది చాలా సాధారణ విషయం. కానీ మనిషి ప్రాణాలు కాపాడటంలో మాత్రం అసాధారణంగా పనిచేస్తుంది. భావి భారత పౌరులైన చిన్నారులు ప్రజల్లో మార్పు తేగలరు. వారు మెరుగైన ప్రభావం చూపించగలరు'అని ఓక్రిడ్జ్ బాచుపల్లి ప్రిన్సిపల్ హేమా సంజయ్ అన్నారు.
'ప్రమాదంలో ఉన్న మనిషికి అంబులెన్స్‌లోకి తరలించి అత్యంత వేగంగా సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకురావడం చాలా చాలా కష్టం. అంబులెన్స్ మోగించే సైరన్ గురించి ప్రజలు కాస్త పట్టించుకుంటే ఆ పని కొంత సులభమవుతుంది. చిన్నారులు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నా. ప్రతి సెకను కాలం అత్యంత కీలకమేననే విషయం అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అని హేమ అన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో, అంబులెన్స్‌కు దారిచ్చేలా సమాజంలో మార్పు తేవడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. అంబులెన్స్‌కు దారిచ్చే సమయంలో 3 నిబంధనలు పాటించాలని చిన్నారులు చెబుతున్నారు. అంబులెన్స్ సైరన్ వినగానే వాహనాన్ని ముందు ఎడమవైపు తీసుకెళ్లి ఆపేయాలి. రెండు కుడివైపు దారి వదలాలి. మూడు అంబులెన్స్ వెళ్లేంత వరకు వాహనాలు నడపొద్దు. వాహనదారులకు వీటిపై అవగాహన కల్పిస్తున్నారు.
No comments:
Post a Comment