From: Srinivasulu Boppana <boppanasrinivasulu@gmail.com>
Date: Wed, Apr 25, 2012 at 6:08 AM
Subject: Dasupalem Tour-Photos
To: vikram kumar <vikram2036@gmail.com>,
Cc:
బొప్పన శ్రీనివాస్ గారూ... మీ ఫోన్ సంఖ్య ఇవ్వండి విక్రమ్ భయ్యా ( 8500386163 ) కు కాల్ చేయగలరు. మీ పరిధిలోని గ్రామాల్లో ఉచితముగా గణిత చమత్కారాలు/ శాస్త్ర ప్రయోగాలు చెప్పాలనుకుంటున్నట్లు మీకిదివరకే తెలిపితి
డైనమిక్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో మేము చేపట్టిన దాసుపాళెం పరిశీలన యాత్ర చాలా సంతృప్తికరంగా సాగింది. చిన్న వయసులోనే తమ పల్లెను అభివృద్ధి చేసుకోవడం కోసం సమాజం పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు బృందానికి మా అభినందనలు. ఆ రోజు ఆద్యంతం ఎక్కడా విసుగు, అలసట ప్రదర్శించకుండా, మా బృందానికి తమ గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను అణువణువునా వివరిస్తూ సాగడం బహుశా ఆయనకే చెల్లుతుందేమో. అందులోనూ మధ్యాహ్నం భోజనం కూడా చేయకనే మాతో పాటు తిరిగారంటే, ఆయనలోని పట్టుదల అర్థమవుతోంది. ముఖ్యంగా మూతబడిన ప్రాథమిక పాఠశాలను తిరిగి తెరిపించి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ముందుకు తీసుకువెళ్ళాలనే ఆయన తపన మాకు బాగా అర్థమైంది. అలాగే గ్రామస్తుల్లో జ్ఞానార్జన పెంచడంకోసం గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆయన సంకల్పం కూడా స్పష్టంగా కనిపించింది. ప్రతి పని చేయడంలోనూ స్వచ్ఛందంగా బాధ్యతలు తీసుకుంటుండడాన్ని మేము గమనించాము. అదే విధంగా, ఇలాంటి సామాజిక బాధ్యతలు తీసుకునే వారికి కుటుంబ సహకారం కూడా తప్పనిసరిగా ఉండాలని నమ్మే మా ఫోరమ్ సభ్యులు ఆ సహకారాన్ని శ్రీనివాసరావు కుటుంబంలో ప్రత్యక్షంగా చూసి మెచ్చుకున్నారు. అంతవరకు కనీవినీ ఎరుగని వారికి ఆతిథ్యం ఇవ్వడం ఒక ఎత్తయితే, అందులో ఆత్మీయత జోడించడం అభినందనీయం. దీనికోసం శ్రీనివాసరావుకు, ప్రత్యేకించి మా తోబుట్టువులకు (ఆయన సోదరీమణులకు) కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొత్తంమీద చెప్పాలంటే, దాసుపాళెం గ్రామంలో శ్రీనివాసరావు బృందం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసిన తర్వాత మా జీవితంలో సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి మేము ఎంత కాలం వృథా చేశామనే విషయం మాకు స్పష్టంగా అర్థమైంది. మా బాధ్యతలను గుర్తు చేసిన శ్రీనివాసరావు బృందానికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
ఇట్లు
భవదీయుడు,
బొప్పన శ్రీనివాసులు
No comments:
Post a Comment