భారతి లిపి – ఎన్నో భారతీయ భాషలని వ్యక్తం చెయ్యగల సులభ, ఏకైక లిపి
మన దేశ ప్రజలు 1600 పైగా భాషల్లో మాట్లాడుతారు. ఆ భాషల్లో 24 సాధికార భాషలు. ఈ భాషలని రాయడానికి 10 పైగా లిపులు వాడుతాము.
ఎన్నో దేశాల్లో దేశం అంతటా ఒకే భాష వాడబడుతూ ఉంటుంది. అలాంటి దేశంలో సమాచార వినియమం సులభంగా జరుగుతుంది. ప్రగతి మరింత వేగవంతం అవుతుంది. మనం దేశం అంతటా ఏకైక భాష వినియోగించబడడం అనేది వాస్తవ, రాజకీయ, సామాజిక పరిస్థితుల దృష్ట్యా జరగని పని అనే చెప్పుకోవాలి.
కాని ఒకే భాష కాక పోయినా ఒకే లిపి వాడడం సాధ్యమా?
మరి యూరప్ లో అదే కదా జరుగుతోంది? యూరప్ లో ఎన్నో భాషలు (గ్రీకు భాష లాంటివి తప్ప) ఒకే లిపిలో రాయబడతాయి. దీని వల్ల దైనిక వ్యవహారాలలో ఎంతో సౌలభ్యం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి మన దేశంలో రాగలదా?
దేశ భాషలన్నిటికీ ఒకే లిపి అంటే అది ఏ లిపి అన్న ప్రశ్న వస్తుంది? తెలుగా, తమిళమా, దేవనాగరా…? ఉన్న లిపులలో దేన్ని ఎంచుకున్నా తక్కిన లిపుల వాళ్లు చిన్నబుచ్చుకుంటారు. మరెలా?
అసలు పలు లిపుల స్థానంలో ఒకే లిపి వాడాలి అంటే ఆ లిపులలో ఏదో సామాన్యత ఉండాలి. మన దేశ లిపులలో ఎన్నో వాటిలో అక్షర కూర్పు ఇంచుమించు ఒక్కలాగే ఉంటుంది. అక్షరాలు, 1) అచ్చులు (అ, ఆ, ఇ, ఈ…), 2) హల్లులు (క, ఖ, గ, ఘ…), 3) గుణింతం (క, కా, కి, కీ…) ఈ తరహాలో రూపొందించబడి వుంటాయి. ఈ రకమైన అక్షరకూర్పు గల లిపులు మనకి తొమ్మిది వున్నాయి. అవి –
హిందీ/మరాఠీ, బెంగాలీ/అస్సామీస్, ఒరియా, గుజరాతీ, గురుముఖీ (పంజాబీ లిపి), తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం.
ఒకే అక్షరాలని వ్యక్తం చెయ్యడానికి ఇన్ని లిపులు ఎందుకు? (మన ప్రాణం తియ్యడానికి తప్ప!)
కనుక ఈ తొమ్మిది లిపులకి బదులుగా ఒకే ఏకైక లిపిని వాడడానికి వీలవుతుందా?
తప్పకుండా అవుతుంది.
అంతే కాదు. ఆ లిపి వీటిల్లోనే ఒకటి కానక్కర్లేదు. ఎందుకంటే ఈ తొమ్మిది లిపులు కూడా నా ఉద్దేశంలో మరీ జటిలంగా ఉన్నాయి. అంత జటిలంగా ఉండనక్కర్లేదు. ఎందుకంటే మన లిపులలో ఆక్షరకూర్పులో, వాటి వెనుక ఉన్న శబ్ద క్రమంలో ఒక చక్కని తర్కం, ఒక తీరు, తెన్ను ఉన్నాయి. కాని శబ్దంలో ఉన్న విన్యాసం అక్షరం యొక్క లిఖిత రూపంలో ప్రతిబింబం కావడం లేదు. కనుక లిపులు మరీ సంక్లిష్టంగా ఉన్నాయి.
ఎందుకంటారా? రెండు కారణాలు:
- శబ్దంలో బాగా పోలిక గల అక్షరాలు ఆకారంలో బాగా భిన్నంగా ఉంటాయి. ఉదాహణకి 'ష', 'శ' అక్షరాలు.
- శబ్దంలో అస్సలు పోలిక లేని అక్షరాలు, ఆకారంలో ఎంతో పోలిక కలిగి ఉంటాయి. ఉదాహరణకి, 'శ', 'ళ' అక్షరాలు.
ఇలాంటి ఉదాహరణలు తెలుగు లిపిలోనే కాదు, మిగతా భారతీయ లిపులు అన్నిట్లోను ఎన్నో ఎత్తి చూపొచ్చు.
ఈ సమస్యలన్నీ గుర్తించిన మీదట ఇలాంటి సమస్యలు లేని ఓ కొత్త లిపిని రూపొందించడం జరిగింది.
ఈ కొత్త లిపి పేరు "భారతి." ఇది యావత్ దేశానికి సంబంధించిన లిపి కనుక దానికి అలా పేరు పెట్టడం జరిగింది.
ఈ లిపి గురించి జులైలో కొంత మీడియా కవరేజ్ వచ్చింది.
ఆ సమయంలో లిపి గురించిన వివరాలు ఇవ్వడానికి వీలు కాలేదు. ఆ వివరాలు ఈ వ్యాసంలో ఇస్తున్నాను.
భారతి అచ్చులు
భారతి హల్లులు
భారతి గుణింతం
(క గుణింతం మాత్రమే ఇవ్వబడింది. ఇదే పద్ధతిలో మొత్తం గుణింతం రాయొచ్చు.)
పూర్తి గుణింతం ఇక్కడ ఇవ్వబడింది…
భారతి అక్షరాలని అలాగే ఎందుకు రూపొందించవలసి వచ్చింది అన్న ప్రశ్నకి ఎంతో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని కొన్ని పోస్టలో రాసుకు రావడానికి ప్రయత్నిస్తాను.
అలాగే భారతి లిపితో వివిధ లిపులలోని అన్ని అక్షరాలని వ్యక్తం చెయ్యొచ్చు అని నిరూపించాలంటే, కొన్ని లిపులలో ఉండే ప్రత్యేక అక్షరాలని ఎలా వ్యక్తం చెయ్యాలో చూపించాలి. ఉదాహరణకి తెలుగులో 'fa' అనే శబ్దం లేదు. 'ఫ' మాత్రమే వుంది. కాని గురుముఖి లో 'fa' ఉంది. అలాగే తమిళ, మలయాళ భాషల్లో 'zha' అనే శబ్దం వుంది. అది తెలుగులో లేదు. ఇలాంటి ప్రత్యేక అక్షరాలన్నిటికీ 'భారతి లిపి'లో చోటు కల్పించడం జరిగింది.
ప్రత్యేక లిపులలో ఉండే ప్రత్యేక అక్షరాలని భారతి లిపితో ఎలా వ్యక్తం చెయ్యొచ్చో ముందు ముందు పోస్ట్ లలో చర్చిస్తాను.
భారతి లిపి మీద బ్లాగర్ల వ్యాఖ్యానం, చర్చ ఎంతో విలువైనదని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ లిపి మీద మీ ఆలోచనలు తెలుసుకోగోరుతూ…
పైన ఇచ్చిన లింక్ లో కొన్ని అక్షరాలు కనిపించడం లేదు. http://cmsrv.iitm.ac.in/icbsd2013/bharthi/bharathi_draft2.html
ఇక్కడ అక్షరాలన్నీ సరిగ్గా వున్నాయి..
http://www.biotech.iitm.ac.in/faculty/CNS_LAB/bharathi_draft2.html
----
विक्रम कुमार
8500386163
विक्रम कुमार
8500386163
No comments:
Post a Comment