Wednesday, May 29, 2019

‘డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌’ సంస్థ చేపట్టిన ‘ఐ కెన్‌’

 పెద్దలు చెప్పినట్లు పిల్లలు వినాలనుకుంటాం. కానీ ఎప్పుడైనా వాళ్లేం చెప్పాలనుకుంటున్నారో- ఆలోచించామా? వాళ్ల చిన్ని బుర్రల్లో ఏం ఆలోచనలున్నాయో, సమాజం కోసం ఏంచేయాలనుకుంటున్నారో- అడిగామా? చిన్నపిల్లలు, వాళ్లకేం తెలుసూ... అనుకున్నాం. మనలాగే చాలామంది తల్లిదండ్రులూ టీచర్లూ అనుకున్నారు. కానీ- 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌' సంస్థ చేపట్టిన 'ఐ కెన్‌' ఛాలెంజ్‌లో పాల్గొన్న పిల్లల్నీ వారు సాధించిన విజయాల్నీ చూశాక వారి అభిప్రాయం మారిపోయింది... మనదీ మారుతుంది!

పాపాయి పుట్టినప్పటి నుంచీ మనం నేర్పించడం మొదలెడతాం. నవ్విస్తాం...    ఏడ్పిస్తాం... బోర్ల పడితే పాకమని ముందుకు తోస్తాం. పాకుతుంటే లేపి కూర్చోబెడతాం. కూర్చుంటే ఊతమిచ్చి నిలబెడతాం. నిలబడితే వేలందించి నడిపిస్తాం.  నడుస్తుంటే డాన్స్‌ చేయమంటాం. మాటలు చెబుతుంటే పాటలు  పాడమంటాం.  ఈ ముద్దూ ముచ్చట్లతో ఓ మూడేళ్లు ముందుకు తోయడం అయిపోతుంది. ఆ తర్వాత... వెనక్కి లాగడం మొదలెడతాం.  ఇటు రావద్దు, అటు వెళ్లవద్దు, ఇది తీయొద్దు, అది ముట్టుకోవద్దు, అల్లరి చేయొద్దు, పరుగులు పెట్టొద్దు... ఇవేగా మనం మాట్లాడే మాటలు.

తర్వాత... ఇంట్లో అమ్మానాన్నా చెప్పినట్లు వినాలి. బడిలో టీచరు చెప్పినట్లు వినాలి. కూర్చోమంటే కూర్చోవాలి. నుంచోమంటే నుంచోవాలి. చదవమన్నది చదవాలి. రాయమన్నది రాయాలి... ఇది మనం నేర్పే క్రమశిక్షణ. కరిగించిన మైనాన్ని అచ్చులో పోసి కొవ్వొత్తిని తయారుచేసినట్లుగా పిల్లల్నీ మనం క్రమశిక్షణ పేరుతో ఒక మూసలో పెంచుతున్నాం. అన్నీ నేర్చుకుంటూ తమకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకోవాల్సిన వయసంతా పిల్లలు ఇలా పెద్దలు కీ ఇచ్చి ఆడించే బొమ్మల్లా ఉంటున్నారు కాబట్టే పెద్దయ్యాక కూడా ఆ పరిధులు దాటి కొత్తగా ఏమీ చేయలేకపోతున్నారు. అందుకనే కోట్లలో పిల్లలున్న మన దేశంలో ఏవైనా అద్భుతాలు సాధించినవారి గురించి చెప్పబోతే పట్టుమని పదిమంది కూడా తేలడం లేదు... ఆ లోటును భర్తీ చేస్తానంటోంది 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌' అనే సంస్థ. మార్పు కోసం ఈ సంస్థ చెబుతున్న మార్గం ఏమిటంటే...

ఆ అవకాశం పిల్లలకిస్తే... 
బ్యాట్‌మ్యాన్‌, స్పైడర్‌మ్యాన్‌ లాంటి సూపర్‌ హీరోలు ఎవరెవరి కష్టాలనో తమ శక్తియుక్తులతో ఇట్టే పరిష్కరించడాన్ని పిల్లలు అబ్బురంగా చూస్తారు. వాళ్లలాగా నటిస్తూ ఆనందిస్తారు. నిజంగా అలాంటి సూపర్‌ హీరోలయ్యే అవకాశం వాళ్లకే ఇస్తే... అదే చేస్తోంది ఈ 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌'. 8-16 మధ్య వయసు పిల్లల్లో కొత్తవి తెలుసుకోవాలన్న కుతూహలమూ ఆలోచనా ఎక్కువగా ఉంటాయి. ఆ శక్తి సామర్థ్యాలను ఒక గాడిలో పెడితే పిల్లలు చాలా పనులు చేయగలరు. ఆ అనుభవంతో చక్కని వ్యక్తిత్వాన్నీ అలవరచుకోగలరు. ఆ ఆశయంతోనే రూపొందించిన 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌' కార్యక్రమం పూర్తిగా పిల్లల కోసం పిల్లలే చేసేది. వారిలో నిద్రాణంగా ఉన్న ఆలోచనాశక్తికీ సృజన శక్తికీ ఇది పనిపెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వారిని 'నేను చేయగలనా' అన్న సంశయం నుంచి 'చేయగలను' అని ఆత్మవిశ్వాసంతో జవాబు చెప్పేలా తీర్చిదిద్దుతుంది ఈ విధానం. ఏ అంశానికైనా అన్వయించుకుని చేయడానికి వీలయ్యేలా రూపొందించిన ఈ డిజైన్‌ నాలుగు దశల్లో ఉంటుంది. పిల్లలు ముందుగా ఒక అంశాన్ని ఎంచుకుని- దాని ప్రభావాన్ని తాము అనుభూతి చెందుతారు, పరిష్కరించడానికి ఏం చేయాలో ఆలోచిస్తారు, ఆలోచనని ఆచరణలో పెడతారు, ఫలితాలను నలుగురితో పంచుకుంటారు. ఇంగ్లిషులో ఫీల్‌- ఇమాజిన్‌- డూ- షేర్‌... అనే ఈ నాలుగు దశల్నీ కలిపి 'ఫిడ్స్‌ ఫర్‌ కిడ్స్‌' అంటున్నారు. పిల్లల్లో ఉత్సాహాన్ని రేకెత్తించి ఈ విధానానికి ఎక్కువ ప్రాచుర్యం కల్పించడానికి ఏటా 'ఐ కెన్‌' ఛాలెంజ్‌ పేరుతో వేసవి సెలవుల్లో పోటీ ప్రకటిస్తారు. స్కూళ్ల తరఫున పిల్లలు బృందాలుగా ఇందులో పాల్గొని తాము తెచ్చిన మార్పు కథలను వ్యాసం, ఫొటోలూ, వీడియోల రూపంలో పంచుకోవచ్చు. గెలిచిన బృందాలను రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి తీసుకెళ్తారు.

పిల్లలు తెచ్చిన మార్పులు! 
పిల్లలు ఎన్ని రకాలుగా ఆలోచించగలరో, వారికి ఎన్ని విషయాలు తెలుసో చెబుతాయి ఈ కథలు. ఉదాహరణకు... 
బడి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుతూ రోడ్డుమీదికి వెళ్లిపోయి ప్రమాదాలకు గురవుతున్నారు. గోడ కట్టించేందుకు స్కూలు దగ్గర డబ్బు లేదు. తరుణోపాయం ఏమిటని ఆలోచించిన పిల్లలకు సైన్సు టీచరు చెప్పిన వ్యర్థానికి అర్థం పాఠం గుర్తొచ్చింది. టీచరు సహాయంతోనే యూట్యూబ్‌లో వీడియోలు చూశారు. పారేసిన ప్లాస్టిక్‌ సీసాల్లో ఇసుక నింపి వాటినే ఇటుకలుగా పెట్టి మట్టితో గోడ కట్టొచ్చని తెలుసుకున్నారు. వందలాది సీసాలను సేకరించారు. తమ తల్లిదండ్రుల్లో నిర్మాణపని తెలిసినవారిని బతిమాలి మట్టిగోడ కట్టించుకున్నారు. కాంక్రీటుతో కడితే రూ.60 వేలు ఖర్చయ్యేది. అలాంటిది నామమాత్రపు ఖర్చుతో బడిచుట్టూ చక్కటి గోడ కట్టుకున్న తమిళనాడులోని ఆచిమంగళం అప్పర్‌ ప్రైమరీ స్కూలు పిల్లలు రూ.50వేల బహుమతినీ గెలుచుకున్నారు.

కేరళలోని ఒక చిన్న పల్లెటూళ్లో ఉన్న పాఠశాలకి కరెంటు లేదు. గదుల్లోకి చాలినంత వెలుగు రాదు. మిగతా కాలాల్లో బయట చెట్లకింద కూర్చుని చదువుకున్నా వర్షాకాలం లోపల కూర్చోక తప్పేది కాదు. కాంతి గురించి పాఠం చదువుకున్న ఏడో తరగతి పిల్లలకు ఓ ఆలోచన వచ్చింది. టీచరుకి చెప్పి దాన్ని ఆచరణలో పెట్టారు. భవనం పైకప్పు పెంకులతో ఉండడంతో మధ్య మధ్యలో ఆ పెంకుల్ని తొలగించి ఒక పద్ధతి ప్రకారం అద్దాలు అతికించారు. దాంతో తరగతి గదుల్లోకి చాలినంత వెలుగు వచ్చింది. పిల్లలు చేసిన ఈ పనిని ఓ టీచరు డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌కి పంపగా సృజనాత్మక ఆలోచన అన్న సర్టిఫికెట్‌తో పాటు రూ.20వేల ప్రోత్సాహకమూ లభించింది.

బడిలో మధ్యాహ్నభోజనం తిన్నందుకు ఆ పిల్లలు ఇంటికెళ్లి మళ్లీ అమ్మ చేతిలో దెబ్బలు తినాల్సివచ్చేది. ఎందుకంటే- స్కూల్లో కట్టెలపొయ్యిమీద వండిన అన్నం గిన్నెను గదంతా ఈడుస్తూ పిల్లలకు వడ్డించడం వల్ల నేలంతా మసి అయ్యేది. అదే పిల్లల దుస్తులకూ అంటుకునేది. అలాకాకుండా పాత్రను ఒకచోట ఉంచి పిల్లల్ని వరసగా వచ్చి పళ్లెంలో వడ్డించుకోమంటే ఒకళ్లకు ఒకళ్లు తగిలి ఆహార పదార్థాల్ని దుస్తుల మీద పోసుకునేవారు. అలా దుస్తులకు ఏదో ఒక మరక చేసుకుని వస్తున్న పిల్లల్ని తల్లులేమో కోప్పడేవారు. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలనుకున్న పిల్లలు తమ బుర్రలకు పదునుపెట్టి తక్కువ ఎత్తులో ఓ చక్రాల బండి డిజైన్‌ రూపొందించారు. పెద్దల సాయంతో దాన్ని తయారుచేయించుకున్నారు. అన్నం గిన్నెని దానిమీద పెట్టి తోసుకెళ్తూ వరసగా కూర్చున్న పిల్లలకు తేలిగ్గా వడ్డిస్తున్నారు సిబ్బంది. అటు మసి మరకలూ లేవు, ఇటు ఆహార పదార్థాలు పారబోసుకునే పనీ లేదు. 'మిడ్‌డే వీల్‌'గా పేరొందిన వీరి ప్రాజెక్టు టాప్‌ 20లో ఎంపికై రూ.20 వేలు గెలుచుకుంది.

కశ్మీర్‌లోని హర్కబహదూర్‌ అనే కొండప్రాంతంలో ఉంది ఓ స్కూలు. దానికి ఒక పక్క కొండ ఉంటే మరో పక్క పల్లపు ప్రాంతం ఉంటుంది. అటువైపు అడ్డు గోడ లేకపోవడంతో పిల్లలు ఆడుకుంటూ ఆ పల్లంలోకి పడిపోయేవారు, లేదంటే పడిపోయిన బంతులూ బ్యాట్ల కోసం వెళ్లి దెబ్బలు తగిలించుకునేవారు. ఆ ప్రాంతంలో అసలు స్కూలు నడపడమే కష్టంగా ఉండడంతో ఇంక గోడ కట్టించమని అడగలేకపోయారు తల్లిదండ్రులు. దాంతో పిల్లలే పూనుకున్నారు. వెదురు బొంగులూ ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలూ సేకరించారు. వెదురు బొంగులతో దడిలాగా కట్టి దానికి సీసాలను వేలాడదీసి వాటికి చక్కగా జెండా రంగులు వేసి గోడలాగా మరుగు ఏర్పాటుచేసుకున్నారు. దాంతో పిల్లలు పడిపోవటం తగ్గింది. 
ఈ ప్రాజెక్టు రూ.50 వేల ప్రథమ బహుమతిని గెలుచుకుంది.

సిద్ధిపేటలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఈగల బెడద పిల్లల్నీ సిబ్బందినీ ఎంతో చికాకు పెట్టేది. ఆహారపదార్థాల మీద గుంపులుగా వాలే ఈగల వల్ల పిల్లలు తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. దాంతో ఎలాగైనా వాటిని వదిలించుకోవాలనుకున్న పిల్లలు అసలు ఈగలు రావడానికి కారణం సిబ్బంది మిగిలిపోయిన ఆహారపదార్థాలను హాస్టల్‌ వెనకాలే పారేయడమని తెలుసుకుని వారి చేత ఆ అలవాటు మాన్పించారు. దూరంగా ఉన్న ఖాళీ జాగాలో గొయ్యి తవ్వి వ్యర్థాలను అక్కడ వేయించారు. ఎక్కడికక్కడ చెత్తబుట్టలు పెట్టి వాటిని సరిగ్గా వాడేలా చూడటం, వంటగదినీ, భోజనాలగదినీ బోరిక్‌ పౌడర్‌ కలిపిన నీటితో తరచూ శుభ్రం చేయడం, ఆవరణలో పుదీనా మొక్కలు నాటడం... లాంటి పలు చర్యలతో 
వసతిగృహాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. దాంతో ఈగలు పోయాయి. పిల్లల ఆరోగ్యాలూ కుదుటపడ్డాయి. టాప్‌ 20లో స్థానం పొందిన వీరి ప్రాజెక్టు రూ. 20వేల గ్రాంటును పొందింది. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పిల్లలు రకరకాల సమస్యలపై పనిచేశారు. మూఢనమ్మకాలూ బాల్యవివాహాల్లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా, పర్యావరణ పరిరక్షణకూ, బడిలో ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, సమాజంలో తాము చూస్తున్న అన్యాయాల గురించీ వారు ఆలోచించారు, పరిష్కారానికి కృషిచేశారు. పిల్లలు ఈ పనులన్నీ చేయడం వల్ల చదువుమీద ఎలాంటి ప్రభావం పడుతుందన్న అంశం మీదా నిపుణులు అధ్యయనం చేశారు.

వ్యక్తిత్వమే మారిపోతుంది! 
ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల పిల్లల వ్యక్తిత్వంలో చెప్పుకోదగ్గ మార్పు వస్తోందని నిపుణులు చెబుతున్నారు. 
నిశిత పరిశీలన: చుట్టూ జరుగుతున్న సంఘటనల్నీ, సమాజాన్నీ నిశితంగా పరిశీలించి చూడడమూ, వాటిని తమకు అన్వయించుకోవడమూ తెలుస్తోంది. 
సృజనాత్మక పరిష్కారం: ఆయా విషయాలకు తమదైన పరిష్కారమార్గాన్ని ఆలోచించడం వారి మేధస్సుకూ సృజనశక్తికీ పదునుపెడుతోంది. 
బృందస్ఫూర్తి: కలిసికట్టుగా పనిచేయడం వల్ల బృందస్ఫూర్తి అలవడుతోంది. 
సహానుభూతి: దివ్యాంగులనీ, ఇతరత్రా సమస్యల్లో ఉన్నవారినీ సహానుభూతితో అర్థం చేసుకుని వారినీ తమతో కలుపుకుని ముందుకు సాగుతున్నారు. 
పెరుగుతున్న టీచర్ల బాధ్యత: పిల్లలు చేపట్టే ప్రాజెక్టులకు మార్గదర్శకులుగా పనిచేయడం వల్ల టీచర్లు మరింతగా పిల్లలతో మమేకమవుతున్నారు. 
పెద్దల దృక్పథాల్లో మార్పు: పిల్లల ఆలోచనాపరిధి విస్తృతమవుతూ సామాజిక బాధ్యతలను గుర్తించే స్థాయికి ఎదగడం చూసిన పెద్దల దృక్పథాల్లోనూ మార్పువస్తోంది. మొత్తంగా ఇవన్నీ కలిసి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్నీ, ఈ శతాబ్దపు జీవననైపుణ్యాల్నీ పెంపొందిస్తున్నాయి. వారిని గెలుపు దిశగా నడిపిస్తున్నాయి. ఈ మార్పు వారిని మెరుగైన పౌరులుగా తయారుచేస్తుందన్నది నిస్సందేహం... అంటున్నారు నిపుణులు. 
చదువులోనూ ముందే: పిల్లల్లో ఈ మార్పు చదువు మీద కూడా మంచి ప్రభావమే చూపుతోంది. మొదటినుంచీ 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌' విధానాన్నే అనుసరిస్తున్న అహ్మదాబాద్‌లోని రివర్‌సైడ్‌ స్కూలు పిల్లలు బోర్డు పరీక్షల ఫలితాల్లోనూ దేశంలోని ఉత్తమ పాఠశాలల సరసన నిలుస్తున్నారు.

పోటీ మొదలైంది! 
ఈ ఏడాది 'ఐ కెన్‌' ఛాలెంజ్‌ ప్రకటన వెలువడింది. స్కూల్‌ తెరిచినప్పటినుంచి మొదలుపెట్టి దసరా సెలవుల లోపల ప్రాజెక్టు పూర్తి చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నాలుగు మొదటి బహుమతులు(రూ.50వేలు), రెండు 
ద్వితీయ బహుమతులు(రూ.25వేలు) కాకుండా టాప్‌ ట్వంటీ ఐడియాలకూ ప్రోత్సాహక బహుమతులు(రూ.20వేలు) ఉంటాయి. designforchangeindia.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి పోటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

                    *

ఒక ఊళ్లో పిల్లలు బడికి వెళ్లే రోడ్డు మీద పెద్ద బండరాయి ఒకటి అడ్డంగా ఉంది. పెద్దలంతా తప్పుకుని పక్కనుంచీ వెళ్లిపోయేవారు కానీ ఆడుతూ పరుగులు తీస్తూ వెళ్లే పిల్లలు మాత్రం ఎదురు దెబ్బలు తగిలించుకునేవారు. అది చూసిన ఒక కుర్రాడు 
ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నించాడు. 'వచ్చాడ్రా  వీరాంజనేయుడు' అంటూ తోటిపిల్లలంతా నవ్వారు. మర్నాడు ఆ కుర్రాడితో పాటు మరో కుర్రాడూ ఓ చేయి వేశాడు. రాయి కదల్లేదు, కాసేపు ప్రయత్నించి వాళ్లు బడికెళ్లిపోయారు. మూడో రోజు పిల్లలందరూ తలో చేయీ వేశారు. కాస్త కదిలింది. పిల్లల్ని చూసి అటుగా వెళ్తున్న పెద్దలూ వచ్చి చేయికలిపారు. అంతా కలిసి కష్టపడి ఆ పెద్ద బండరాయిని పక్కకు తోసేశారు. దారికి ఇప్పుడు ఏ అడ్డమూ లేదు. బండరాయినికదిలించాలనుకున్న ఆ మొదటి కుర్రాడే ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్‌ పటేల్‌.ఇప్పుడు సమాజానికి కావలసింది మార్పు దిశగా మొదటి అడుగు వేసే అలాంటి కుర్రాళ్లే! వాళ్ల శక్తిసామర్థ్యాల్ని వెలికి తీసే ఇలాంటి పథకాలే!

పిల్లలే ప్రేరణ

ఓరోజు ఆరోతరగతి పిల్లలకు హక్కుల గురించి పాఠం చెప్పడంలో భాగంగా కిరణ్‌ వారిని బాలకార్మికులు పనిచేస్తున్న ఓ అగరుబత్తీల ఫ్యాక్టరీకి తీసుకెళ్లి పనిచేయమంది. రెండు గంటలకే నడుంనొప్పితో విలవిల్లాడిన విద్యార్థులు రోజూ ఎనిమిది గంటలు పనిచేస్తున్న బాలకార్మికుల పరిస్థితికి తల్లడిల్లారు. చదువుకోవాల్సిన పిల్లలు ఎందుకు పనిచేస్తున్నారో, దానికి పరిష్కారమేమిటో ఆలోచించండి- అని కిరణ్‌ యథాలాపంగా తన స్కూలు పిల్లలతో అంటే మర్నాడు వాళ్లు రకరకాల ప్రణాళికలతో ముందుకొచ్చారట. పిల్లల చొరవా ఆలోచనా చూసి ఆశ్చర్యపోయిన కిరణ్‌ వారిని ప్రోత్సహించింది. ఓ టీచర్ని వారికి సాయంగా పంపితే- పిల్లల్ని పనిలో పెట్టుకోవటం నేరమని ఫ్యాక్టరీల వారికీ, బడికి పంపమని తల్లిదండ్రులకీ నచ్చజెప్పి, కొందరు పిల్లల్ని తీసుకెళ్లి వారే బడిలో చేర్పించారట. ఈ విధానాన్నే మరికొన్ని కార్యక్రమాలకూ అనుసరించి చూసిన కిరణ్‌కి 'ఫిడ్స్‌' అనే నాలుగంచెల డిజైన్‌ పట్ల స్పష్టత వచ్చింది. దాని ఆధారంగానే 'ఐ కెన్‌' ఛాలెంజ్‌ని నిర్వహిస్తోంది. ఏ అంశాన్ని ఎంచుకున్నా దానికి తమదైన శైలిలో పరిష్కారం చూపి నిజంగా పిల్లల్లో ఇంత సామర్థ్యం ఉందా అన్పించేలా ఉండటమే ఈ కార్యక్రమం ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలు ఈ విధానాన్ని అమలుచేయడం విశేషం. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాజెక్ట్‌ జీరో పరిశోధక బృందం డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల్లో సహానుభూతి పెరగడాన్నీ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం అలవడడాన్నీ గమనించింది. 'ఫిడ్స్‌' పద్ధతిని ఏ సందర్భానికైనా ఉపయోగించవచ్చనీ, దీని ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి అది చదువులోనూ రాణించేందుకు తోడ్పడుతుందనీ నిర్ధారించింది.

ఆలోచన కిరణ్‌ది!

'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌'ని రూపొందించిన కిరణ్‌ బీర్‌ సేఠీ వృత్తిరీత్యా ఇంటీరియర్‌ డిజైనర్‌. ఆరేళ్ల వాళ్లబ్బాయికి స్కూల్లో అయిన అనుభవం ఆమెను విద్యావేత్తను చేసింది. టీచరు చెప్పిన పాఠాన్ని బట్టీ పట్టకుండా సొంతంగా రాసుకెళ్లినందుకు టీచరు ఆ అబ్బాయిని కోప్పడింది. సొంతంగా రాశానన్న ఉత్సాహంతో బడికెళ్లిన పిల్లవాడు డీలా పడిపోయి ఇంటికి రావడంతో టీచరు చర్య ఆ చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీసిందో అర్థం చేసుకున్న కిరణ్‌ పిల్లల వ్యక్తిగత ప్రతిభకీ వారి సృజన శక్తికీ ప్రాధాన్యమిస్తూ కొత్తగా స్కూలు ఎందుకు నడపకూడదనుకుంది. విద్యావేత్తగా మారి అహ్మదాబాద్‌లో 'రివర్‌సైడ్‌ స్కూల్‌'ని ప్రారంభించింది. భవనంతో మొదలెట్టి బోధనా, పనితీరూ, ఫలితాలవరకూ ఆ స్కూలు ఇతర పాఠశాలలకు భిన్నంగా ఉంటుంది. కొద్దిరోజుల్లోనే మంచి ఆదరణ పొందిన తమ స్కూలు విధానాలను అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్న కిరణ్‌ లాభాపేక్ష లేని సంస్థగా 'డిజైన్‌ ఫర్‌ ఛేంజ్‌'ని ప్రారంభించింది.


 

Friday, May 24, 2019

letter to interns

already given clear instructions. ..u can choose project of ur choice that will be helpful to society. plz call 8500386163 for specifications if u don't understand. Thanks for sending the bengAli story about crow. U can send more stories like that..and that is also treated as a part of internship

नमस्कार  Some of u have submitted the assignment..the audio file of a moral story. Many others did not. If the audio assignment is not sent by 28-5-19, it will be assumed that those candidates have no interest in this internship.   50 applications came within 1.5days. just to go through them on the surface also takes lot of time. Only boys have the additional option to come to office and work.  I myself will be busy in the  summer training program for 1500 children that will be organized by TTD at tirupati during 27th May to 2nd June. So  Formally the selection Wil b intimated by 3-6-19. U can start the work now itself from home ...something like arvindguptatoys.com  Or cell phone detector (if brought to classroom)/ cell phone jammer or playing audio using optical communication (rs. 300 or less) etc.. The circuit / item can be something that helps in safety of children/ / patients  Plz remember...we cannot pay internship amount for more than two ppl.   If there is any important issue  plz mail to vikrambhayya@gmail.com or call . Else need not reply     Don't worry about certificates. 1st start the work.  U r given lot of freedom to choose good projects on ur own. U can  take help of books/internet/ junior/senior/ friends...  धन्यवाद  ----  8500386163
--

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം

For MATLAB/ Arduino_Robotics/ Mathematical magics workshop at your college mail to vikrambhayya@gmail.com.
Some video lectures can be seen at: http://padaayi.blogspot.in/p/blog-page_27.html

----
विक्रम कुमार
8500386163


Thursday, May 23, 2019

కొందరి ఓటమి స్వాగతించతగినది...

కొందరి ఓటమి స్వాగతించతగినది(ఎన్నికల్లో గెలిచిన వారంతా బుద్ధిమంతులు కాకపోవచ్చు)...
నారాయణ- మున్సిపల్ మంత్రి గా వుండి తెలుగు భాష కు తీవ్ర అన్యాయం చేసెను?
----

బాబు- మద్య నిషేధం అమలు చేయకుండా ఆడపడుచులకు డబ్బులిస్తామని మభ్యపెట్టి వారికి కుంకుమ పసుపు దూరం చేయదలచటం! మహిళలలంటే ఏ మాత్రం గౌరవం ఉన్నా మద్యనిషేధం విధించేవారు.
ఆడియో టేపుల వ్వవహారం= తెలుగు వారు తలెత్తుకోకుండాచేశాడు.
తిరుపతి ఆలయం/ విజయవాడ గుడి... అన్నీ వివాదాస్పమైనాయి..ఈయన ఏలుబడిలో! ఐటీ ముఖ్యమంత్రి గా మంచి పనులు చేసినా... పైన పేర్కొన్నవి మామూలు తప్పులుకాదు

---- 
కోడెల శివప్రసాద్- ఇటీవల ఆయన నియోజకవర్గం వైపు వెళ్ళినపుడు తన వారసుడు రాజ్యాంగేతర శక్తి గా రెచ్చిపోతున్నాడనిపించె. 

----

భూమన ఎలాంటి వాడో కాని...తాను తెలుగు భాష బ్రహ్మోత్సవాలు & తిరుపతి ఉత్సవాలను 2020లో నిర్వహించాలని ఆశిస్తున్నాం
----


Fwd: [Announce] Learn a Hindi Word a Day


नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


About 38days back I had been to your campus. As ppl from various parts of the country gather there, there arises a need to understand various languages.
How things work  at IIT can be seen below. YOu may do similarly in your inst. for various languages. If you start doing that..plz keep forwarding me such mails to vikrambhayya@gmail.com
Over a period of time it will become a good database

ధన్యవాదములు
----
8500386163



---------- Forwarded message ---------
From: Hindi Cell <hindicell@iitm.ac.in>
Date: Tue, Apr 16, 2019 at 10:27 AM
Subject: [Announce] Learn a Hindi Word a Day
To: announce@list.iitm.ac.in <announce@list.iitm.ac.in>


   " रोज एक हिन्दी शब्द सीखें "

Hindi word    -      आम निर्वाचन  / आम चुनाव
                                     (तमिलनाडु में आम चुनाव 18.04.2019 को है ।)

Tamil Meaning -   *தேர்தல் (therdal)
               
Hindi Pronunciation - aam nirvaachan / aam chunaav

Meaning         - election
                                                  (General Election is on 18.04.2019 in Tamil Nadu.)                
                                                         
*The Tamil word is as per 'Agastiyar Trilingual Dictionary'.
                     
सादर,
सहायक कुलसचिव (संप्रेषण एवं जनसंपर्क)
AR (Communication & PR) 
हिंदी कक्ष (प्रशासन) / Hindi Cell (Admn.)
आई आई टी मद्रास/IIT Madras
चेन्नै/Chennai-600036
दूरभाष/Telephone-044-2257 8024
ई-मेल/E-mail- hindicell@iitm.ac.in
_______________________________________________
Announce mailing list
Announce@list.iitm.ac.in
http://mx.iitm.ac.in/mailman/listinfo/announce

Virus-free. www.avg.com

Fwd: [Seminars] [Seminars by Research Proposals]Dynamic Characterization of Sand-Rubber Tire Shred Mixtures for Seismic Base Isolation of Low-Rise Buildings



---------- Forwarded message ---------
From: ceoffice@iitm.ac.in <ceoffice@iitm.ac.in>
Date: Wed, May 22, 2019 at 11:40 AM
Subject: [Seminars] [Seminars by Research Proposals]Dynamic Characterization of Sand-Rubber Tire Shred Mixtures for Seismic Base Isolation of Low-Rise Buildings
To: <seminars@list.iitm.ac.in>


Research Proposal Seminar Talk


Title: Dynamic Characterization of Sand-Rubber Tire Shred Mixtures for Seismic Base Isolation of Low-Rise Buildings
Date/Time: 27-05-2019 4:00 pm
Venue: BSB 128, VSH (Visveswaraya Seminar Hall) - Ground Floor
Speaker: Mr. B. R. Madhusudhan, Ph.D Scholar, (Roll No. CE14D201)
Guide:Prof. A. Boominathan and Dr.Subhadeep Banerjee

Abstract:
Sand-rubber mixtures have gained recent research importance for their various engineering applications. One such application could be as seismic base isolation materials for low-rise buildings. The present study deals with the dynamic characterization of sand-rubber tire shred mixtures. The rubber tire shreds of fine size are mixed with river sand used for construction purposes in various controlled proportions and tested under dense conditions. The engineering properties viz., shear strength, compressibility, permeability and the dynamic response of the mixtures in large strain range are determined. A series of strain-controlled consolidated undrained monotonic triaxial shear tests, monotonic direct shear tests, strain-controlled dynamic triaxial tests under undrained conditions, one-dimensional compression tests , permeability tests are performed under fully saturated and dry conditions in this regard. The brittleness index which is a measure of ductility and the energy absorption capacity is also discussed. The contact angle of sand-water and the rubber-water interfaces determined using Goniometer are used to explain the intriguing findings from permeability tests. In addition, this study proposes an appropriate method to find the angle of repose of dry sand-rubber tire shred mixtures. The angle of repose of the mixtures is compared with the angles of internal friction obtained from triaxial shear and direct shear tests. From the results of the experimental investigations, it is found that sand-rubber tire shred mixtures show satisfactory static and dynamic properties required for seismic isolation of low-rise buildings.

Other information:ALL ARE WELCOME !!!




CE Office
Department of Civil Engineering, IIT Madras
_______________________________________________
Seminars mailing list
Seminars@list.iitm.ac.in
http://mx.iitm.ac.in/mailman/listinfo/seminars

Virus-free. www.avg.com

Fwd: [Seminars] [Seminars by Visitors] Spherical collapse of fuzzy dark matter



---------- Forwarded message ---------
From: sriramkumar@iitm.ac.in <sriramkumar@iitm.ac.in>
Date: Thu, May 23, 2019 at 9:24 AM
Subject: [Seminars] [Seminars by Visitors] Spherical collapse of fuzzy dark matter
To: <seminars@list.iitm.ac.in>




Title: Spherical collapse of fuzzy dark matter
Date/Time: 29-05-2019 4:00 pm
Venue: HSB 209
Speaker: V. Sreenath
Affiliation of the speaker:
Inter-University Centre for Astronomy and Astrophysics, Pune

Abstract:
It has been postulated that fuzzy dark matter (FDM) could be a viable alternative to cold dark matter (CDM). FDM is comprised of ultralight bosons which exist as a Bose Einstein condensate. Due to the very low mass of FDM, the de Broglie wavelength of these bosons are of the order of kpc and the quantum effects manifest at those scales. Hence, unlike CDM, FDM experiences quantum pressure along with gravitational attraction. Due to these competing forces, structure formation in FDM is more involved than in CDM. In this talk, after an introduction to FDM, I will speak about my recent work on the simplest model of structure formation, namely the spherical collapse model, of FDM. In particular, I will explain how one could incorporate quantum pressure to extend the spherical collapse model of CDM to the case of FDM.





L. Sriramkumar
Physics
_______________________________________________
Seminars mailing list
Seminars@list.iitm.ac.in
http://mx.iitm.ac.in/mailman/listinfo/seminars

Virus-free. www.avg.com

Wednesday, May 22, 2019

ప్రజలు సుభిక్షంగా ఉండటం కంటే కావాల్సిందేముంది?

ద్దాఖ్‌ ప్రాంతంలో సగటు వర్షపాతం చాలా తక్కువ. అందుకే అక్కడి జనాలు వర్షాలని పెద్దగా నమ్ముకోరు. హిమాలయాల్లో ఉన్న గ్లేషియర్స్‌(మంచు నదులు)కరిగినప్పుడు వచ్చే నీటినే వివిధ అవసరాలకు వాడుకుంటారు. గోధుమలు, బార్లీ, యాపిల్‌ వంటి పంటలు పండించుకుంటూ ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. కొంతకాలంగా ఈ పర్వత ప్రాంతవాసులకు గడ్డుకాలమే నడుస్తోంది. భూతాపం కారణంగా అక్కడి మంచునదులు వేగంగా కరిగిపోతున్నాయి. దాంతో అయితే వరదలు... లేకపోతే కరవు అన్నట్టుగా ఉంది అక్కడి పరిస్థితి. ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లోనైతే నీటికోసం రైతుల మధ్య పెద్దపెద్ద పోరాటాలే జరుగుతాయి. వ్యవసాయ పనులు అన్నీ అయిపోయిన తర్వాత శీతకాలంలో మాత్రం హిమానీనదాల నుంచి వచ్చిన నీరు ఎవరికీ ఉపయోగపడకుండానే వృథాగా సింధునదిలో కలిసిపోతూ ఉంటుంది.

మంచు స్తూపాలు...
ముఖ్యంగా ఏప్రిల్‌, మే నెలల్లో రైతులు పంటలు పండించుకునేందుకు కావాల్సిన నీరు అందితే పర్వతప్రాంత వాసుల కష్టాలు గట్టెక్కుతాయి. కానీ నీరు అందించే హిమానీనదాలు భూతాపం కారణంగా వేగంగా కరిగిపోతున్నాయి. అలా కరిగిపోయిన వాటి స్థానంలో మనమే కృత్రిమంగా ఎందుకు గ్లేషియర్స్‌ లేదా మంచుకొండలు నిర్మించకూడదు అనుకున్నాడు విద్యావేత్త, ఇంజినీర్‌ అయిన సోనమ్‌వాంగ్‌చుక్‌. శీతకాలంలో వృథాగా నదుల్లో కలిసిపోతున్న నీటిని వాడుకుని వాంగ్‌చుక్‌ బృందం మంచుస్తూపాలు చేయడం మొదలుపెట్టింది.
ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి పారుతున్న నీటిని పాలిఎథిలిన్‌ ట్యూబుల ద్వారా కిందకు తీసుకొస్తారు. సహజంగా నీరు పల్లానికి వచ్చేటప్పుడు వేగంగా వస్తుంది కదా! ఆ వేగాన్ని వాడుకుని నీటిని స్ప్రింకర్ల సాయంతో పైకి ఎగజిమ్మేట్టు చేస్తారు. ఈ పనిని రాత్రిపూట మాత్రమే చేస్తారు. ఎందుకంటే... అప్పుడయితే వాతావరణం మరీ చల్లగా ఉంటుంది. అలా మైనస్‌ 30 డిగ్రీల దగ్గర ఎగజిమ్మిన నీరు 
 బయటకు 

రాగానే గాల్లోనే గడ్డకట్టేస్తుంటుంది. క్రమంగా అదో శంకు లేదా స్తూపం ఆకారాన్ని సంతరించుకుంటుంది. పైప్‌లైన్లలో నీరు గడ్డకట్టకుండా వాటిని భూమి అడుగు నుంచి వేస్తారు. స్తూపాలకున్న ప్రత్యేకమైన ఆకృతి మూలంగా అవి కొన్ని నెలల పాటు కరగకుండా అలానే మంచుకొండల్లా ఉంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగే ఏప్రిల్‌, మేనెలల్లో ఈ స్తూపాలు క్రమంగా కరిగి దిగువన ఉన్న గ్రామ అవసరాలకు, పంటలకు కావాల్సిన నీరు అందిస్తాయి. ఈ నీటితోనే లావెండర్‌, వాల్‌నట్‌, యాపిల్‌, బార్లీ, గోధుమ పంటలని ఇక్కడ ప్రజలు పండిస్తున్నారు. విద్యుత్‌ని ఏమాత్రం ఉపయోగించుకుండా కేవలం గురుత్వాకర్షణ శక్తి, వేగం, ఒడుపు వంటి ప్రకృతి నియమాలని వాడుకునే ఈ విజయాన్ని సాధించింది వాంగ్‌చుక్‌ బృందం. ఆరేళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రయోగం ఫలితంగా ఇప్పటివరకూ కొన్ని వేల ట్యాంకర్లతో సమానమైన నీటిని ఇక్కడి ప్రజలు పొందగలిగారు.

మంచుస్తూపాల ప్రయోగంతో హిమాలయాల్లోని వందల గ్రామాలు లబ్ధి పొందుతాయి. ప్రజలు సుభిక్షంగా ఉండటం కంటే కావాల్సిందేముంది అంటూ స్థానిక బౌద్ధ గురువు చేసాంగ్‌ రింపోచే ఈ ప్రాజెక్టుకు కావాల్సిన వందల ఎకరాల స్థలాన్ని పైగా అనే బౌద్ధ ఆరామం వద్ద కేటాయించారు. 5000 చెట్లను నాటించారు. ప్రపంచంలోని అనేకచోట్ల పర్వత ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ ప్రాజెక్టు ఓ పరిష్కారం అందిస్తుందని ప్రపంచం నమ్ముతోంది. అందుకే ఈ ప్రాజెక్టుకు కోట్లాది రూపాయల సీడ్‌ఫండ్‌ అందింది. క్రౌడ్‌ఫండింగ్‌ రూపంలో మరిన్ని నిధులు సేకరిస్తోంది


వాంగ్‌చుక్‌... మూడంటే మూడు గడపలున్న హిమాలయ ప్రాంతపు కుగ్రామంలో జన్మించాడు. చాలా సంవత్సరాల వరకూ స్కూల్‌ అంటే ఏంటో తెలియదు అతనికి. అమ్మనేర్పిన అక్షరాలే అతనికి దారి చూపించాయి. కశ్మీర్‌ వెళ్లి ఇంజినీరింగ్‌ చదివిన వాంగ్‌చుక్‌... పర్వతప్రాంత పిల్లల కోసం సెక్‌మాల్‌(స్టూడెంట్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ మూమెంట్‌ ఆఫ్‌ లద్దాఖ్‌)పేరుతో స్కూల్‌ని స్థాపించాడు. అంతా దీన్ని స్కూల్‌ ఫర్‌ ఫెయిల్యూర్స్‌ అని పిలుస్తారు. వైఫల్యాల నుంచి విజయాలు సాధించే స్కూల్‌ ఇది. గ్లోబల్‌వార్మింగ్‌ వంటి సమస్యలకు వాస్తవ పరిష్కారాలని వెతికేందుకు ఈ బడిని వేదికగా మార్చాడు వాంగ్‌చుక్‌. పాతికేళ్ల క్రితం స్థాపించిన ఈ బడి ఇప్పుడు యూనివర్సిటీ ఫర్‌ ఫెయిల్యూర్స్‌గా మారింది. అనేక ఉపాధి అవకాశాలని చూపించే శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తారు.. ఈ స్కూల్‌ నుంచి ఎంతోమంది సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు, కళాకారులు పుట్టుకొచ్చారు. ఐస్‌మాన్‌ ఆఫ్‌ లద్దాఖ్‌ అంటారు వాంగ్‌చుక్‌ని.


 

Monday, May 20, 2019

Message to Electronic circuot design interns

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം
Good to know ur interest in utilization of summer holidays. Plz understand that we cannot give paid internship to more than 2 ppl. So plz keep applying to other opportunities as well.  
3 categories:(1) We pay u for internship and also give components cost
(2) We don't pay internship amount but will give components cost
(3) We pay for nothing. U need to buy and do.
In your reply plz take care of the following:
Task 1:Which of the above options r ok for u?
TAsk2: plz audio record a small moral story in ur mother tongue(3-5min) and send as attachment.
Task 3: This offer is only for decent Boys...would u like to come to office(cum residence)  for 3 to 30 days and work? If so when can u come? Especially students (boys) from non telugu region r welcome to see Andhra Pradesh

Meanwhile u may apply as student ambassador in www.bharatiscript.com



----
विक्रम कुमार
8500386163


Sunday, May 19, 2019

ఒంటి చేత్తో వందెకరాలకు నీరిచ్చాడు eenadu

ఒంటి చేత్తో వందెకరాలకు నీరిచ్చాడు!

ఓ పక్క... చినుకు పడితే గానీ పంట పండని నేలలు. మరోపక్క...ఊరికి ఆవల ఉప్పొంగి ప్రవహిస్తున్న జలధార. ఆ నీటిని పొలాలకు మళ్లించే నాయకుడు వస్తాడేమో అని ఏళ్ల తరబడి ఎదురు చూశారు అక్కడి జనం. చివరికి విసిగిపోయి ఆశల మీద నీళ్లు చల్లి ఊరుకున్నారు. కానీ వారిలో ఒక్కడు మాత్రం ఊరుకోలేకపోయాడు. తనే నాయకుడు అయ్యాడు. ఒంటిచేత్తో కాలువ తవ్వడం మొదలు పెట్టాడు. ఫలితం... వందెకరాల బీడు భూముల్లో పచ్చని పైరులు మొలిచాయి.

వైతరణి... ఒడిశాలోని కెందుఝార్‌ జిల్లా, బన్స్‌పల్‌ గిరిజన ప్రాంతంలోని ఓ ఊరు. చుట్టూ కొండలూ అడవి మధ్య ఉండే ఈ ఊళ్లో నేల తడవాలన్నా పంట పండాలన్నా వాన నీరే దిక్కు. మరోపక్కేమో ఊరంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికేవాళ్లే. పంట బాగా పండితే గానీ తిండి గింజలు దొరకని పరిస్థితి. వర్షాలు అసలు పడకపోయినా సమయానికి సరిగా కురవకపోయినా వారి పంట చేతికొచ్చేది కాదు. ఏడాదంతా ఆ ప్రాంతం కరవుతో అల్లాడిపోయేది. నిజానికి వైతరణి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోనే గోణశిఖ పర్వతం నుంచి నీటి ప్రవాహం వెళ్తుంది. ఆ జలాలను ఊరికి మళ్లిస్తే ఏడాదికి మూడు పంటలు సాగు చేసుకునే వీలుంటుంది. అదే విషయాన్ని స్థానిక అధికారులకు చెప్పి కాలువ నిర్మించమని వేడుకున్నారు గ్రామస్థులు. కానీ ఏళ్లు గడిచినా వారి గోడు పట్టించుకునే నాయకుడే రాలేదు.

ఒక్క అడుగే... 
ఓసారి రెండు మూడు సంవత్సరాలు వరుసగా వర్షాలు సరిగా పడలేదు. దాంతో కరవు మరింతగా తాండవం చేసింది. అందరిలానే స్థానికంగా ఉండే దైతారీ నాయక్‌ మీద కూడా ఆ ప్రభావం బాగా పడింది. కానీ అందరిలా అతడు అది తమ తలరాత అనుకుని ఊరుకోలేకపోయాడు. కుటుంబానికి కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని నిస్సహాయతను జీర్ణించుకోలేకపోయాడు. గంగను భువికి తెచ్చిన భగీరథుడిలా ఆ కొండమీదున్న గంగమ్మను తనే ఊరికి తేవడానికి పూనుకున్నాడు. పలుగూ పారా పట్టుకుని, ఒంటిచేత్తో కొండదగ్గర్నుంచి కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. అలా అని దైతారీ నాయక్‌ వయసేమీ తక్కువ కాదు. అప్పటికే 70ఏళ్లకు చేరువలో ఉన్నాడు. కానీ అతడి గుండెబలమే ఆ గుట్టల దారిని పిండి చేయడం మొదలుపెట్టింది. రోజూ ఉదయమే వెళ్లి కొన్ని గంటల పాటు కాలువ పని చేసేవాడు. కొన్నాళ్లకు అతడి ప్రయత్నాన్ని చూసి నాయక్‌ నలుగురు సోదరుల మనసూ కదిలింది. వాళ్లూ చేయి కలిపారు. మూడేళ్లకు రాళ్లూ మట్టితో వాళ్లు వేసిన కాలువ అడవి గుండా ఊరి చివర వరకూ వచ్చింది. నాయక్‌, అతడి అన్నదమ్ముల కృషిని కళ్లారా చూశాక గానీ ఊరి వాళ్లు కళ్లు తెరవలేదు. నిజానికి నాయక్‌ 'మనమే కాలువ తవ్వుకుందాం... కాస్త కష్టపడితే అందరి పొలాలూ పండుతాయి' అని ఊరి వాళ్లకు ముందే చెప్పాడు. కానీ 'మూడు కిలోమీటర్ల దూరం కాలువ తవ్వడం మాటలేనా...' అంటూ అందరూ వెనకడుగు వేశారు.

చివరికి 'అందరికీ నీరు తెచ్చే ఆ ప్రయత్నానికి ఇకమీదటైనా సాయపడతామ'ని ముందుకొచ్చారు. అలా ఒక్కడి ప్రయత్నంతో మూడు కిలోమీటర్ల పొడవునా కాలువ ఏర్పడింది. వైతరణి గ్రామం చుట్టుపక్కలున్న వంద ఎకరాలూ సస్యశ్యామలం అయ్యాయి. దాదాపు అయిదేళ్లుగా ఏరోజూ ఆ జలధార ఆగలేదు. ఇప్పుడు అక్కడి పొలాల్లో వరి, మొక్కజొన్న, ఆవాలతో పాటు కూరగాయల్నీ పండిస్తున్నారు రైతులు. దైతారీ నాయక్‌ చేసిన గొప్ప పని గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ ఠాక్రె గ్రామానికి వచ్చి అతడిని అభినందించడంతోపాటు ఆ కాలువకు కాంక్రీటుతో మరమ్మతులు చేయించి పటిష్ఠంగా మారుస్తామనీ అక్కడ చెక్‌ డ్యామ్‌ని కూడా నిర్మిస్తామనీ హామీ ఇచ్చారు. ఇక, వయసుని లెక్కచేయకుండా ఒంటిచేత్తో వందెకరాలకు నీరిచ్చిన దైతారీ నాయక్‌ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడంలో శ్చర్యమేముందీ... నాయక్‌ నిజంగా నాయకుడే కదూ..! 


ఐకమత్యము_కీర్తన్ APP

नमस्कार / నమస్కారము /ನಮಸ್ಕಾರ/ வணக்கம்/ নমস্কাৰ/ નમસ્તે/ ସୁପ୍ରଭାତ/ നമസ്കാരം


ఐకమత్యము_కీర్తన్  (done by intern)  Install in android phone and play the math magic game (2MB; time consumed per game <= 2minutes)
https://drive.google.com/open?id=1s1uJrPNbOzk2Giwv5IKOTj6m1fNmqYle

----
विक्रम कुमार
8500386163



Virus-free. www.avg.com

Unity app by keertan Nit durgApur

'ఆత్మీయ‘బంధన్‌' frm eenADu Sunday

Frm eenADu Sunday
ఆత్మీయ'బంధన్‌'

వ్యక్తికీ సమాజానికీ... అవసరానికీ ఆలోచనకీ... ఆర్థిక సంస్థకీ పేదలకీ... మధ్య బంధం ఎలా ఉండాలో చెప్పే సంస్థ- బంధన్‌. పల్లెల్లో మహిళలకు రుణాలిచ్చే చిన్న సంస్థగా పుట్టి, బ్యాంకుగా దేశమంతటా విస్తరించడానికి రెండు దశాబ్దాలు కూడా పట్టలేదంటే దానికి కారణం - చంద్రశేఖర్‌ ఘోష్‌. పేద కుటుంబం నుంచీ బంధన్‌ బ్యాంక్‌ సీఈవో వరకూ ఆయన ప్రస్థానం స్వయంకృషికి సజీవ సాక్ష్యం.

సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఓ రోజు... 
'నేను ఉద్యోగం మానేస్తున్నా...' ఓ రాత్రి భార్యకి చెప్పేశాడు చంద్రశేఖర్‌. 'నలభై  ఏళ్లొస్తున్నాయి. ఇప్పుడీ జోకులేంటీ' నవ్వింది ఆమె. కానీ ఆయన ముఖం చూస్తే జోకులాగా అన్పించలేదు. ఒకింత గుబులుగా భర్త కళ్లలోకి చూసింది. 'నిజంగానే...  వ్యాపారం చేస్తా...' అన్నాడు నిబ్బరంగా. 'ఏం మాట్లాడుతున్నారో మీకర్థమవుతోందా? కుటుంబబాధ్యతలన్నీ మీమీదఉన్నప్పుడు ఉద్యోగం మానేసి ప్రయోగాలు చేస్తానంటారేమిటి?' అంటూనే ఆమెకు దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆయన ఎంత నచ్చజెప్పినా రాత్రంతా ఆమె ఏడుస్తూనే ఉంది. ముందూవెనకా ఎలాంటి ఆస్తులూ లేని కుటుంబానికి ఆయన జీతమే ఆధారం. దాన్ని పొదుపుగా వాడుతూ పొద్దున్న లేస్తే ఇంటిల్లిపాది అవసరాలన్నీ చూడాల్సింది ఆమే మరి. ఇంకా అతని తమ్ముళ్లూ చెల్లెళ్ల బాధ్యతలు తీరనేలేదు. అత్తగారి బాగోగులూ పెద్దవాడవుతున్న కొడుకు చదువూ... ఇవన్నీ ఎలా అన్నదే ఆమె ఆందోళన. చంద్రశేఖర్‌ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. భార్య అంతగా బాధపడుతున్నా నెలకు ఐదువేలు వస్తున్న ఉద్యోగం మానేయాలని అతడు ఎందుకనుకున్నాడంటే...

కష్టాలు తెలుసు కానీ... 
ఓరోజు ఉదయమే కూరలు తేవడానికి కచ్చాబజార్‌ మార్కెట్‌కి వెళ్లాడు చంద్రశేఖర్‌. అక్కడ స్కూటర్‌ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు బళ్లమీద కూరగాయలూ పండ్లూ అమ్ముతున్న చిరువ్యాపారులకు ఐదేసి వందలు ఇచ్చి వారి దగ్గరనుంచి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్లు వెళ్లిపోయాక అక్కడివారిని అడిగాడాయన. వాళ్లెందుకు డబ్బు పంచిపెట్టారని. 'డబ్బు పంచిపెట్టలేదు నాయనా. ఐదు రూపాయల వడ్డీకి అప్పు ఇచ్చారు. వడ్డీ ముందే తీసుకున్నారు. సాయంత్రం వచ్చి అసలు వసూలుచేసుకెళ్తారు. కూరలు కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మడానికి మా దగ్గర ఐదువందల రూపాయలు ఎక్కడుంటాయి. అందుకే వడ్డీకి తీసుకుంటాం' అని వివరంగా చెప్పిందో అవ్వ. గణాంక శాస్త్రం చదివిన ఆయన బుర్ర ఆమె చెప్పినదాన్ని అరక్షణంలో విశ్లేషించింది. ఒక పూటకి ఐదువందలకు ఐదు రూపాయలు అంటే 700 శాతం వడ్డీ అన్నమాట. ఆ విషయమే వారికి చెబితే- 'ఆ లెక్కలు మాకు తెలియవు. వ్యాపారానికి డబ్బు కావాలి. ఎలాంటి ష్యూరిటీలూ అడక్కుండా మా దగ్గరికి వచ్చి మరీ వాళ్లు డబ్బిస్తున్నప్పుడు కష్టమో నష్టమో ఐదురూపాయలు వడ్డీ కట్టక తప్పేదేముంది' అన్న వారి సమాధానం అతనిలో ఆలోచన రేకెత్తించింది. రోజంతా కష్టపడి పనిచేస్తున్న వాళ్లకి అంత వడ్డీ పోగా మిగిలేది పదో పరకో. వడ్డీ వ్యాపారి మాత్రం కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోజూ వందల్లో సంపాదిస్తున్నాడు. ఎంత దారుణమిది... అనుకున్న చంద్రశేఖర్‌ అక్కడున్న వాళ్లందరితో మాట్లాడాడు. పల్లెల్లో అయినా, పట్టణాల్లో అయినా పేదల పరిస్థితి ఒకటే అని అర్థమైంది. పూటగడవడమే కష్టమైన వారికి ఆస్తిపాస్తులుండడమన్నది కలలోని మాటే. హామీ పెట్టడానికి ఆస్తులేమీ లేనివారికి బ్యాంకులు రుణాలు ఇవ్వవు. మరో దారి లేక వాళ్లు వడ్డీవ్యాపారుల మీద ఆధారపడుతున్నారు. సంపాదనలో వడ్డీ పోగా మిగిలినదాంతో పిల్లలకు తిండి పెట్టడమే గొప్ప. ఇంక చదువులెక్కడ? అందుకే ఎన్నాళ్లు కష్టపడినా వాళ్ల బతుకులు అలాగే ఉంటున్నాయి. సమస్యకి మూలం ఎక్కడుందో అర్థమైన చంద్రశేఖర్‌కి కర్తవ్యం తెలిసివచ్చింది. పేదవారికి సౌకర్యంగా ఉండే పద్ధతిలో తక్కువ వడ్డీతో అప్పు ఇస్తే తప్ప వారి పరిస్థితి మారదనీ పిల్లలు చదువుకోలేరనీ అర్థం కాగానే ఆ పని తానే చేయాలని నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్‌ ఆ నిర్ణయానికి రావడానికి కారణం ఆయన బాల్యమే.


 

నిరుపేద కుటుంబం 
త్రిపురలోని నరౌర గ్రామంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో ఆరుగురు సంతానంలో పెద్దవాడిగా పుట్టాడు చంద్రశేఖర్‌. తండ్రి నడిపే మిఠాయి దుకాణమే ఆ కుటుంబానికి ఆధారం. చిన్నారి చంద్రశేఖర్‌ రోజూ బడికి వెళ్లడానికి ముందూ, బడినుంచి వచ్చాకా దుకాణంలో తండ్రికి సాయం చేసేవాడు.  చదువుకుంటేనే ఎక్కడైనా బతకవచ్చని చెప్పే తండ్రిమాటను అర్థంచేసుకున్న చంద్రశేఖర్‌ ఎన్ని పనులు చేస్తున్నా చదువు కొనసాగించాడు. పట్టణానికి వెళ్లి పై చదువులు చదివే స్థోమత లేక బంధువుల సాయంతో ఢాకాలోని రామకృష్ణ మఠంలో ఆశ్రయం పొంది కాలేజీలో చేరాడు. చదువుకుంటూనే ట్యూషన్లు చెబుతూ తన ఖర్చులకు తానే సంపాదించుకునేవాడు. స్టాటిస్టిక్స్‌లో ఎంఎస్సీ చేస్తుండగానే తండ్రి క్యాన్సర్‌తో మరణించాడు. దాంతో కుటుంబ బాధ్యత చంద్రశేఖర్‌ మీద పడింది. అక్కడే ఓ ఎన్జీవోలో ఉద్యోగంలో చేరాడు. తరచూ తుపానులు వచ్చే ఆ ప్రాంతం పేదరికానికి పర్యాయపదంలా ఉండేది. అక్కడి పల్లెల్లోని ప్రజలను సంఘటిత పరిచి, వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు సంస్థ తరఫున సహాయం అందించడం చంద్రశేఖర్‌ బాధ్యత. అది తన మనస్తత్వానికి దగ్గరగా ఉండటంతో అందులో మమేకమై పనిచేసేవాడు చంద్రశేఖర్‌. కొన్నేళ్లు అక్కడ పనిచేశాక స్వదేశానికి తిరిగివచ్చి పెళ్లి చేసుకుని కోల్‌కతాలో స్థిరపడినా మరో ఎన్జీవోలోనే ఉద్యోగంలో చేరాడు. విధినిర్వహణలో భాగంగా పల్లెల్లో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే బాధ్యత పైనే దృష్టిపెట్టిన చంద్రశేఖర్‌లో సొంతంగా తానే ఏమన్నా చేయాలన్న ఆలోచన మొదలైంది మాత్రం కూరగాయల మార్కెట్లో వడ్డీల విషయం ప్రత్యక్షంగా చూశాకే. దానికి తోడు ఏళ్ల తరబడి పల్లెల్లో తిరిగిన అనుభవం మహిళలకు చేయూతనిస్తే మొత్తం కుటుంబం గాడినపడుతుందన్న నమ్మకాన్ని ఇచ్చింది. అందుకే చిరువ్యాపారాలకు తక్కువ వడ్డీకి అప్పులిచ్చే సంస్థను పెడితే తాము బతుకుతూ మరికొంతమందికి మేలు చేయవచ్చని భార్య నీలిమకు నచ్చజెప్పి రంగంలోకి దిగాడు.

వడ్డీకి తెచ్చి మరీ... 
బ్యాంకు లోను తీసుకుని ఆ డబ్బుని తక్కువ వడ్డీకి అప్పులిచ్చి పేదలకు ఆర్థికభారం తగ్గించాలన్నది అతడి ప్లాను. ముందుగా పెట్టదలచుకున్న సంస్థకు సంబంధించిన విధివిధానాలన్నీ స్వయంగా రాసుకున్నాడు. 
మహిళలకే, వారి ఇంటి వద్దకే వెళ్లి అప్పు ఇవ్వాలి. వారు దానితో వ్యాపారమో, చేతివృత్తులో చేసుకుని డబ్బు సంపాదించుకోవాలి. అప్పు తీసుకునేవాళ్లంతా కచ్చితంగా సంతకం చేయడం నేర్చుకోవాలి. ప్రతి ఊళ్లోనూ బడి పెట్టాలి... ఇలాంటి ఆశయాలన్నీ గుదిగుచ్చి పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకుని ఒక ఎన్జీవోను ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత లోను కోసం బ్యాంకుకు వెళ్తే అధికారులు అతడికి రుణం ఇవ్వలేదు. అందుకు వారు చెప్పిన కారణాలు- అతడు సమాజంలో పేరున్న వ్యక్తి కాదు, అతడి ఎన్జీవోకి లాభాలు సంపాదించిన అనుభవం లేదు,  మూడేళ్ళపాటు వరసగా లాభాలు సంపాదిస్తే తప్ప ఎన్జీవోకి లోను ఇచ్చే ప్రశ్నే లేదు అని. దాంతో బావమరిది దగ్గరా మరికొందరు బంధువుల దగ్గరా అప్పు చేసి మొత్తం రెండు లక్షల రూపాయలతో, ముగ్గురు ఉద్యోగులతో బగ్నాన్‌ అనే గ్రామంలో 'బంధన్‌'కి శ్రీకారం చుట్టాడు చంద్రశేఖర్‌. నెల తిరిగేసరికే ఆ డబ్బు అయిపోయింది. కానీ పేదల దగ్గర మాట నిలుపుకోడానికి ఏ వడ్డీవ్యాపారుల పద్ధతినైతే తాను వ్యతిరేకిస్తున్నాడో వారి దగ్గరకే వెళ్లి వడ్డీకి తెచ్చి మరీ అప్పులు ఇచ్చాడు. అది కొనసాగిస్తూనే పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏడాదిన్నర తర్వాత తొలి బ్యాంకు రుణం లభించింది. ఆ తర్వాత సంస్థ అభివృద్ధే బ్యాంకుల్ని పిలిచి రుణాలిచ్చేలా 
చేసింది.

ఒకరిని చూసి మరొకరు... 
ఇరవై ఏళ్ల సునీత ఉండేది కోల్‌కతాకి దూరంగా ఒక మారుమూల పల్లెలో. రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అమ్మానాన్నలకు సాయపడటానికి ఆమెకి బంధన్‌ దారిచూపించింది. ఇప్పుడామె నేసే సంప్రదాయ శాలువాలకి మంచి పేరు. దిల్లీలోని మురికివాడలో ఉంటున్న షహనాజ్‌ బంధన్‌ దగ్గర అప్పుతీసుకుని మిషన్‌ కొనుక్కుంది. సూట్లు కుడుతూ మరో నలుగురికి ఉద్యోగమూ ఇచ్చింది. గౌహతికి చెందిన సంజయ్‌ ఇల్లు గడపడానికి కట్టెలనుంచీ కూరగాయల వరకూ ఏవేవో అమ్మాడు. బంధన్‌ గురించి తెలిసి రుణం తీసుకుని సొంతంగా దుకాణం పెట్టుకున్నాడు. స్థిరమైన ఆదాయంతో పిల్లల్ని చదివించుకుంటున్నాడు. ఇలా చెబుతూ పోతే బంధన్‌తో పెనవేసుకున్న బంధాలు లక్షలు! ఆర్థికంగా నిలదొక్కుకున్న కుటుంబాలన్నీ పిల్లల్ని చదివించడం చూస్తే చంద్రశేఖర్‌కి తన ఆశయం నెరవేరుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది జీవితాలను ప్రభావితం చేయడానికి అతడు పడ్డ కష్టం ఇంతా అంతా కాదు. ఇంటికొచ్చి డబ్బు ఇస్తానంటున్న చంద్రశేఖర్‌ని మొదట కొంచెం వింతగానే చూశారు గ్రామస్థులు. అయితే వడ్డీవ్యాపారులకు భిన్నంగా ఉన్న అతడి ప్రవర్తన వారిని కట్టిపడేసింది. సైకిల్‌ మీద తిరుగుతూ ఆడవాళ్లందరినీ ఒకచోట కూర్చోబెట్టి సూక్ష్మరుణాల గురించీ చిన్నమొత్తాల పొదుపు గురించీ వివరించి చెప్పేవాడు. తొలివిడతగా- నెలకు రెండు వేల లోపు ఆదాయం ఉన్న పాతిక మంది  మహిళలను ఎంచుకుని వాళ్లకు తలా వెయ్యి రూపాయలు అప్పుగా ఇచ్చాడు. పెట్టుబడికి డబ్బు లభించడంతో ఆ చిరు వ్యాపారులు ఎక్కువ వ్యాపారం చేసి వారం తిరిగేసరికి రెట్టింపు సంపాదించగలిగారు. చెల్లించాల్సిన వడ్డీ కూడా నామమాత్రమే కావడంతో మొట్టమొదటిసారి వాళ్లు చేతిలో మిగులు డబ్బు చూసుకోగలిగారు. అది చూసి మెల్ల మెల్లగా గ్రామంలోని మహిళలందరూ బృందాలుగా మారి అప్పు తీసుకోవడం మొదలెట్టారు. అలా మొదలైంది బంధన్‌ ప్రస్థానం... ఒక వీధి నుంచి మరో వీధికి, ఒక పల్లె నుంచి మరో పల్లెకి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి. ప్రారంభించి పదేళ్లు కాకముందే 22 రాష్ట్రాలకు విస్తరించి దాదాపు 60 లక్షల మంది సభ్యులతో నూరుశాతం తిరిగి చెల్లింపుల రికార్డుతో దేశంలోనే అతి పెద్ద మైక్రోఫైనాన్స్‌ సంస్థగా ఉన్న బంధన్‌ ఆర్‌బీఐ నియమాలను అనుసరించి ఎన్జీవో నుంచి నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా మారింది. అయితే ఈ ప్రస్థానంలో తన వెనక ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర మరువలేనిదంటాడు చంద్రశేఖర్‌.

ఒక్కరు మిగిలారు! 
తొలిదశలో సిబ్బంది నియామకం విషయంలో అతడికెదురైన అనుభవం మరో వినూత్న ప్రయోగానికి తెరతీసింది. చంద్రశేఖర్‌ ఇచ్చిన పత్రికాప్రకటన చూసి పదిమంది దరఖాస్తు చేయగా ఇంటర్వ్యూకి ఐదుగురే వచ్చారట. వారికి ఉద్యోగంలో చేయాల్సిన పనుల గురించి చెప్పగానే ముగ్గురు తిరిగి వెళ్లిపోయారట. ఇద్దరు అప్పాయింట్మెంట్‌ లెటర్లు తీసుకోగా మర్నాడు ఒక్కరే ఉద్యోగంలో చేరారని చెబుతాడు చంద్రశేఖర్‌. పల్లెలకు వెళ్లి పనిచేయడాన్ని నామోషీగా భావించే యూనివర్శిటీ గ్రాడ్యుయేట్లతో లాభం లేదనుకున్న చంద్రశేఖర్‌ స్వయంగా గ్రామాలకు వెళ్లి అక్కడ హైస్కూలు, ఇంటర్మీడియట్‌ చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకుని శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. అది మూడువిధాలుగా ప్రయోజనకరంగా మారింది. తనకి కావలసిన రీతిలో శిక్షణ ఇచ్చి స్థానిక భాషలో మాట్లాడగల సమర్థులైన సిబ్బందిని చంద్రశేఖర్‌ తయారుచేసుకోగలిగితే, స్థానికంగానే మంచి ఉద్యోగం చేసుకునే అవకాశం యువతకు లభించింది. తమ ఊరి కుర్రాళ్లే లావాదేవీలన్నీ నిర్వహిస్తుండటంతో గ్రామస్థుల్లో నమ్మకం పెరిగింది. అలా తన సైన్యాన్ని కూడా స్వయంగా తయారుచేసుకున్నాడు చంద్రశేఖర్‌. బంధన్‌ సిబ్బంది ఇతర సంస్థల ఉద్యోగుల్లా తమ పని తాము చూసుకుని వెళ్లిపోరు. వినియోగదారులదీ తమదీ ఒకే కుటుంబం అన్నట్లుగా కలిసిపోతారు. 'మాది ఆర్థిక బంధం కాదు హార్థిక బంధం. అందుకే బ్యాంకుకు అంత విశ్వసనీయత వచ్చింద'ంటాడు చంద్రశేఖర్‌. బంధన్‌ని సూక్ష్మరుణ సంస్థ నుంచీ బ్యాంకుగా మార్చేటప్పుడు కూడా ఉన్న సిబ్బందికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి బ్యాంకు ఉద్యోగులకు దీటుగా తయారుచేసుకున్నాడు చంద్రశేఖర్‌. పదివేలకోట్లు డిపాజిట్లుగా సేకరించడానికి ఎంత లేదన్నా మూడేళ్లు పడుతుందని తాను అంచనా వేస్తే 16 నెలల్లోనే 21వేల కోట్లు డిపాజిట్లు వచ్చాయనీ అదంతా తన సిబ్బందివల్లేననీ అంటాడాయన.

సవాళ్లను సమర్థంగా... 
చంద్రశేఖర్‌ ఒంటిచేత్తో ప్రారంభించిన ఈ సంస్థ ఒక గ్రామం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ విస్తరించే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లకూ లెక్కలేదు. అయినా నిబ్బరంగా నిలబడటానికి కారణం మొదటినుంచీ చంద్రశేఖర్‌ అమలుచేస్తూ వచ్చిన క్రమశిక్షణే. 'బంధన్‌'లో ఏదైనా రూలంటే రూలే. ఒక్క రూపాయి కూడా లెక్కలోకి రాకుండా పోదు. ఎక్కడా ఒక్క పైసా వృథా కాదు. కార్యాలయాల్లో వినియోగదారులను ఆత్మీయంగా పలకరించే సిబ్బందే కన్పిస్తారు కానీ ఆడంబరాలు కన్పించవు. ఒకదశలో దేశంలోని సూక్ష్మరుణ సంస్థలన్నీ దివాలా తీశాయి. బతికి బట్టకట్టిన సంస్థలు ఆ కష్టాల్లోంచి గట్టెక్కడానికి వడ్డీరేట్లను విపరీతంగా పెంచేశాయి. బంధన్‌ ఒక్కటే ఏ మార్పూ లేకుండా స్థిరంగా నిలబడగలిగింది. ఆర్థికభారాన్ని స్వయంగా భరించిందే కానీ వినియోగదారుల మీద వేయలేదు. 'రిస్క్‌ 
తీసుకోవడం అనేది బాల్యం నుంచీ నాకు అలవాటుగా మారిపోయింది. అందుకే దేన్నైనా నేను రిస్క్‌గా చూడను, మరో కొత్త అవకాశంగా చూస్తాను' అనే చంద్రశేఖర్‌ మొన్నమొన్నటిదాకా పగలంతా సైకిల్‌ మీద పల్లెల్లో తిరుగుతూ పనిచేసేవాడు. రాత్రిపూట సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించేవాడు. ఇప్పుడు ల్యాండ్‌రోవర్‌ కారులో వెళ్తున్నా మారింది అతని వాహనం మాత్రమే, అతను కాదు... అందుకు సాక్ష్యమే దినదిన ప్రవర్థమానమవుతున్న 'బంధన్‌'

       *         *          *

'బంధన్‌' ప్రస్థానంలో రెండు సందర్భాల్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకుంటాడు చంద్రశేఖర్‌. ఉద్యోగం మానేస్తానన్నప్పుడు భార్య ఏడవటమూ, ఆ తర్వాత అప్పు తీసుకునేవారు పెరిగినప్పుడు డబ్బుకోసం ఇబ్బందిపడటమూ. తన మీద తనకున్న నమ్మకంతో మొదటి సందర్భాన్ని గెలిచాననీ రెండో సందర్భంలో నిరాశా నిస్పృహలు దిక్కుతోచకుండా చేసినా రేపటి మీద ఆశ దాన్ని జయించేలా చేసిందనీ చెప్పే చంద్రశేఖర్‌ తనలో ఆ రెండు లక్షణాలే లేకపోతే ఈపాటికి ఒక మామూలు ఉద్యోగిగా రిటైరయ్యేవాడినంటాడు నవ్వుతూ. 


'బంధన్‌' ప్రత్యేకతలివి! 

స్వాతంత్య్రం వచ్చాక తూర్పు భారతావనిలో ఏర్పాటైన తొలి బ్యాంకు బంధన్‌. 2001లో ప్రారంభమైన 'బంధన్‌' దేశంలో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థ. 
2014లో బ్యాంకు లైసెన్సుకి దరఖాస్తు చేసేనాటికి 40వేల మంది సిబ్బందితో 25శాతం మార్కెట్‌షేర్‌తో ఉన్న బంధన్‌ 2015లో పూర్తిస్థాయి బ్యాంకుగా మారింది. 
*  రుణం ఇవ్వడమూ వసూలుచేయడమూ మాత్రమే కాదు, రుణగ్రహీతల వ్యాపారాలనూ క్షేత్రస్థాయి సిబ్బంది గమనిస్తూనే ఉంటారు. ఎక్కడైనా వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిస్తే అవసరమైన సహాయం అందిస్తారు. 
అందుకే ఒకసారి బంధన్‌లో చేరినవారెవరైనా శాశ్వతసభ్యులుగా ఉండిపోతారు. 
*నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం విస్తరిస్తున్న బంధన్‌ గత ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చి ఒక్కసారిగా వ్యాపార ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది హౌసింగ్‌ రుణాల రంగంలో పేరున్న గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుని 
మరింతగా బలపడింది 'బంధన్‌'. గత ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌ పరిశ్రమ పలు సవాళ్లను ఎదుర్కొనగా బంధన్‌ మాత్రం వృద్ధిపరంగా ముందు వరసలో నిలిచింది.

Read this email or something terrible will happen.

<Good afternoon, my naive comrade.> <Unfortunately, this letter will divide your life into before and after.> <However, t...